Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన పాటతో కాదు, ఓ నెటిజన్‌పై ఆగ్రహంతో. తాజాగా ఆమె ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తిపై సీరియస్ కంప్లైంట్ ఇచ్చారు.ఇటీవల మంగ్లీ ‘బాయిలోనే బల్లి పలికే’ అనే ఓ ఫోక్ సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అయితే, ఈ వీడియో కింద ఓ వ్యక్తి అత్యంత అసభ్యకరంగా కామెంట్స్ పెట్టాడు.

Mangli

కేవలం పాటను విమర్శించడమే కాకుండా.. తన కులాన్ని, సామాజిక వర్గాన్ని (ST) కించపరిచేలా నీచమైన వ్యాఖ్యలు చేశాడని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.సోషల్ మీడియా వేదికగా తన పరువుకు భంగం కలిగించడంతో పాటు, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంగ్లీ పోలీసులను కోరారు.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ నెటిజన్ ఐపీ అడ్రస్ ఆధారంగా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా, మంగ్లీతో పాటు నాగవ్వ పాడిన ఈ పాట ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.

మంగ్లీ అసలు పేరు సత్యవతి చౌహాన్. తనదైన ఎనర్జిటిక్ వాయిస్‌తో జానపద, భక్తి పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ముఖ్యంగా బతుకమ్మ, బోనాల పండుగల సమయంలో ఆమె రిలీజ్ చేసే స్పెషల్ సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంటాయి. కేవలం ప్రైవేట్ ఆల్బమ్స్ మాత్రమే కాదు, సినిమాల్లోనూ ‘సారంగ దరియా’, ‘రాములో రాములా’ లాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్‌తో మంగ్లీ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus