కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

కోలీవుడ్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె తన రెండో పెళ్లితో అందరికీ షాక్ ఇచ్చారు. తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్ అనిరుధ్ శ్రీకాంత్‌తో ఆమె ఏడడుగులు వేశారు. చెన్నైలో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.ఈ పెళ్లిలో ఎమోషనల్ హైలైట్ ఏంటంటే.. సంయుక్త తన కొడుకు సమక్షంలోనే ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించడం.

Samyukta

గతంలో కార్తీక్ శంకర్‌ను పెళ్లాడిన సంయుక్త, వ్యక్తిగత విబేధాల వల్ల విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి బాబు బాధ్యతలు చూసుకుంటూ సింగిల్ పేరెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు తన చిన్నారి సాక్షిగానే అనిరుధ్ చేత తాళి కట్టించుకున్నారు.వరుడు అనిరుధ్ శ్రీకాంత్ క్రికెట్ లవర్స్‌కి సుపరిచితుడే. గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున ఆడాడు.

అనిరుధ్‌కి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం. గతంలో మోడల్ ఆర్తి వెంకటేష్‌తో పెళ్లి జరగగా, మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు.కొంతకాలంగా పరిచయం ఉన్న సంయుక్త, అనిరుధ్.. ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని, ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సంయుక్త షేర్ చేసిన వెడ్డింగ్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఈ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.

సంయుక్తకు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా మంచి గుర్తింపు ఉంది. ‘చంద్రముఖి’ సీరియల్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన ఆమె, తమిళ బిగ్‌బాస్ షోతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల్లోనూ ‘వారిసు’, ‘తుగ్లక్ దర్బార్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించింది. ప్రస్తుతం అటు ఫ్యామిలీ లైఫ్‌ని, ఇటు కెరీర్‌ని బ్యాలెన్స్ చేసే ప్లాన్‌లో ఉంది ఈ బ్యూటీ.

పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus