Kriti Sanon: ఆది పురుష్ లాంటి సినిమాలు పిల్లలకు ఎంతో అవసరం

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా హిట్ కాకపోవటంతో తెలుగులో సరైన అవకాశాలు లభించలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితం అయ్యింది. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న “ఆది పురుష్” సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. కృతి సనన్ సీత పాత్రలో, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల నుండి ఊహించని స్పందన వచ్చింది.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ఆదిపురుష్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూలో కృతి సనన్ మాట్లాడుతూ..” ఈ సినిమాలో గొప్ప గొప్ప నటి నటులతో పనిచేయడం తనకు చాలా గర్వంగా ఉందని, వారితోపాటు తనకు కూడా ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభిస్తుందని వెల్లడించింది. ఇక ఈ సినిమాలో తాను పోషించిన సీత పాత్ర తనకు బాగా నచ్చిందని, చిన్నతనంలో దూరదర్శన్ లో ప్రసారమైన “రామాయణ” చూడలేకపోయానని తెలిపారు.

ఇక ఆది పురుష్ సినిమా మాత్రం విజువల్ వండర్ గా తెరకెక్కుతూ ఈ యువతరానికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇతిహాసం గురించి తెలియజేయటానికి ఇది సరైన మార్గం అని వెల్లడించింది. ఇలాంటి సినిమాలు చూడటం వల్ల పురాణాల గురించి పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని చెప్పుకొచ్చింది. ఓం రావత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది” అంటూ కృతి సనన్ చెప్పుకొచ్చింది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus