కృతి సనన్ వెట్ లుక్ కు షాకవుతున్న నెటిజన్లు..!

శివరాత్రితోనే చలి.. ‘శివ శివ’ అంటూ వెళ్ళిపోతుంది అని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. కానీ ఆ తరువాత వచ్చే వేడి గురించి ఎవ్వరూ చెప్పరు. ఓ పక్క కరోనా విజృంభణ మరో పక్క భయంకరమైన ఎండలు. జనాలను బయటకు ఎక్కడ తిరగనిస్తాయి. అందుకే మన స్టార్ హీరోయిన్లు వరుస పెట్టి మాల్దీవులకు చెక్కెయ్యడం మొదలు పెట్టారు. కానీ ఇప్పడు తిరిగొచ్చేస్తున్నారు లెండి. వెళ్ళే ఉద్దేశాలు కూడా వారికి లేవట.

మరి ఇక్కడే ఉంది వేసవి తాపాన్ని తట్టుకోవడం ఎలా అని కొంతమంది హీరోయిన్లు ఆలోచనలో పడితే.. కృతి సనన్ మాత్రం వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ‘సమ్మర్ ఇదిగో ఇక్కడుంది.. బీచ్ లు.. కాక్ టైల్ పార్టీలు కావాలి’ అంటూ అందరినీ రెచ్చగొడుతుంది. అందుకు సింబాలిక్ గా ఓ ఫోటో షూట్ కూడా చేసింది. తడి బట్టలతో, తడిసిన జుట్టుతో హాట్ హాట్ ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.

మహేష్ బాబు- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు అటు తరువాత నాగ చైతన్య- సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘దోచేయ్’ లో కూడా నటించింది. అయితే ఇక్కడ సక్సెస్ లభించకపోవడంతో బాలీవుడ్ కే చెక్కేసింది. సుమారు 6 ఏళ్ళ తరువాత తెలుగు హీరో అయిన ప్రభాస్ తో జోడీ కడుతుంది.దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆది పురుష్’ లో ఈమెనే సీతగా ఫైనల్ అయినట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus