Kushboo: తన తండ్రి గురించి కుష్బూ మరోసారి సంచలన వ్యాఖ్యలు!

సీనియర్ నటి ఖుష్బూ (Khushbu)  అందరికీ సుపరిచితమే.తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. తర్వాత తెలుగులో కూడా ‘కలియుగ పాండవులు’ (Kaliyuga Pandavulu) తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘కెప్టెన్ నాగార్జున’ ‘త్రిమూర్తులు’ ‘భారతంలో అర్జునుడు’ ‘కిరాయి దాదా’ (Kirayi Dada) ‘మారణ హోమం’ ‘చిన్నోడు పెద్దోడు’ ‘శాంతి క్రాంతి’ ‘పేకాట పాపారావు’ వంటి సినిమాల్లో కూడా హీరోయిన్ గా (Kushboo) నటించింది. తర్వాత కొత్త హీరోయిన్ల వల్ల ఈమెకు అవకాశాలు రాలేదు.

Kushboo

అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ‘స్టాలిన్’ (Stalin) ‘యమదొంగ’ (Yamadonga) ‘కథానాయకుడు’ ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి సినిమాల్లో నటించింది. ఇదిలా ఉండగా.. ఖుష్బూ స్వతహాగా చాలా బోల్డ్ అనే సంగతి తెలిసిందే. గతంలో ఈమె తన ‘తండ్రి Laiగిక దాడి చేశాడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తండ్రి గురించి మరోసారి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఖుష్బూ మాట్లాడుతూ.. “చిన్నతనంలోనే నేను Laiగిక వేధింపులకు గురయ్యాను.

ఆ ఘోరానికి పాల్పడింది నా కన్న తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటాను. నాతో పాటు ఆయన నా తల్లి, సోదరులను కూడా చిత్రహింసలకు గురి చేసేవాడు. దగ్గర్లో కర్ర,బెల్టు, చెప్పులు.. ఇలా ఏది అందుబాటులో ఉంటే దానితో దాడి చేసేవాడు. మా అమ్మను కొన్నిసార్లు మరీ దారుణంగా హింసించేవాడు. ఆమె తలను గోడకేసి కొట్టేవాడు. ఇలాంటి దారుణాల గురించి బయటకు చెబితే.. మరింతగా మమ్మల్ని టార్చర్ పెడతాడేమో అని భయమేసి నేను ఆ టైంలో ఎక్కువగా చెప్పేదాన్ని కాదు. అయితే చెన్నైకి వచ్చి నా కాళ్లపై నేను (Kushboo) నిలబడ్డాక నాలో ఆత్మస్థైర్యం పెరిగింది.

తర్వాత నా తండ్రికి ఎదురు తిరగడం మొదలుపెట్టాను. అది అతను భరించలేక షూటింగ్ కి వచ్చి మరీ నన్ను బాగా కొట్టేవాడు. ఆ టైంలో ఉబిన్ అనే ఒక హెయిర్ డ్రెస్సర్ నాకు సాయపడింది. అప్పుడు అంటే 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాపై జరిగిన Laiగిక వేధింపుల గురించి బయటకు ధైర్యంగా చెప్పగలిగాను.దీంతో అతను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అతను ఎటుపోయాడో తెలీదు. ఇప్పటివరకు కలిసింది లేదు. తెలిసిన వాళ్ళు కొంతమంది చనిపోయాడు అని తెలిపారు” అంటూ చెప్పుకొచ్చింది.

33 ఏళ్ళ ‘దళపతి’ గురించి ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus