సీనియర్ నటి లక్ష్మీ (Lakshmi) అందరికీ సుపరిచితమే. హీరోయిన్ ఎన్నో అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె తర్వాత (Ninne Pelladata) ‘నిన్నే పెళ్లాడతా’ (Murari) ‘మురారి’ (Oh Baby) ‘ఓ బేబీ’ (Nani’s Gang Leader) ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాల్లో కూడా అద్భుతమైన పాత్రలు చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా లక్ష్మీ గురించి ఆమె మాజీ భర్త చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మోహన్ శర్మ మాట్లాడుతూ.. “నేను, లక్ష్మి కలిసి చాలా సినిమాల్లో నటించామన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ లక్ష్మి నన్ను ఇష్టపడుతుందని మొదట నేను అనుకోలేదు. తెలియదు కూడా.!
ఒకరోజు నాతో షాపింగ్‌కి వస్తావా అని అడిగింది. నేను ఓకే అని వెళ్ళాను. అప్పుడు ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ కొనాలనుకున్నాను. అప్పట్లోనే దాని ధర రూ.500. కానీ ఆ టైంలో నా దగ్గర అంత డబ్బు లేదు. తర్వాత ఊహించని విధంగా అదే బాటిల్ నాకు బహుమతిగా ఇచ్చింది లక్ష్మి. ఆ వెంటనే నాకు ప్రపోజ్ కూడా చేసింది. ‘నువ్వంటే నాకు ఇష్టం. మీ జీవితంలో నాకు చోటు ఇవ్వండి.నేను మీ కుక్కలా పడుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విని నేను షాకయ్యాను. మొదటిసారి ఓ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది.
నేను వాటిని సీరియస్‌గా తీసుకున్నాను. నాకు ఆరోజు నిద్ర పట్టలేదు. ఆ తర్వాతి రోజు లక్ష్మీ నాకు ఫోన్ చేసి రూమ్ కి రండి అని పిలిచింది. నేను నేరుగా హోటల్ గదికి వెళ్ళాను. ఇద్దరం పెళ్లి చేసుకుందామా? అని మళ్ళీ అడిగింది. ప్రస్తుతం నేను నా కెరీర్‌పై దృష్టి పెట్టాలి. పెళ్లి గురించి ఆలోచించడం లేదు అని చెప్పాను. నేను గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. అందుకే ఆమె పెళ్లి చేసుకుందాం అని అడిగిన పద్ధతి నచ్చి వెంటనే ఆమె నుదుటిపై కుంకుమ పెట్టాను.
ఆ రాత్రి మేమిద్దరం భార్యాభర్తలమయ్యాం. చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి గురించి అధికారికంగా మీడియాకు తెలియజేశాం. అయితే తర్వాత లక్ష్మీ చాలా తప్పులు చేసింది. తన తల్లి గురించి కూతురు ఐశ్వర్య అన్ని విషయాలు నాతో చెప్పింది. దీంతో తల్లికూతురి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. కూతురితో అలా ప్రవర్తిస్తావా? అని వారించినందుకు నాతో ఇష్టానుసారంగా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె ప్రవర్తన నచ్చక విడాకులు తీసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు
భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?