Actress Malashree: భర్తను మిస్ అవుతున్నానంటూ సీనియర్ నటి మాలాశ్రీ పోస్ట్.. వైరల్ అవుతున్న పిక్..

ఫిబ్రవరి 10న పలువురు సెలబ్రిటీలు తమ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత కపుల్ 2005 ఫిబ్రవరి 10న మ్యారేజ్ చేసుకున్నారు. తమ 18వ పెళ్లి రోజుని జరుపుకోవడానికి స్పెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే.. అలాగే మరో సెలబ్రిటీ కపుల్ యాంకర్ సుమ – రాజీవ్ కనకాల కూడా ఈరోజునే తమ 24వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సీనియర్ నటి, కన్నడతో పాటు తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మాలాశ్రీ – రాముల యానివర్సరీ కూడా ఫిబ్రవరి 10నే..

తమిళంలో బాలనటిగా స్టార్ట్ అయిన మాలాశ్రీ కెరీర్.. తర్వాత ఆమె కూడా ఊహించని స్థాయికి వెళ్లింది.1997లో నిర్మాత రాముని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. 2021 ఏప్రిల్ 26న రాము కోవిడ్ బారినపడి కన్నుమూశారు. ఫిబ్రవరి 10న తమ యానివర్సరీ సందర్భంగా భర్తతో కలిసున్న ఫోటోకి.. ‘నేను నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను.. నిన్ను బాగా మిస్ అవుతున్నాను’ అంటూ భావోద్వేగభరితమైన కామెంట్ చేశారు మాలాశ్రీ..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus