స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తార‌క్ హీరోయిన్‌…!

కొందరు ఫేడ్ అవుట్ సెలబ్రిటీలు ఏదోలా పాపులర్ అయ్యేందుకు కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల గురించి అడిగినప్పుడు కూడా వారు ఎవరో నాకు తెలియదు అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలుగులో ఒకప్పుడు అరకొర సినిమాలు చేసిన మీరా చోప్రా అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి అడిగితే అతను ఎవరో తనకు తెలియదు అంటూ చేసిన కామెంట్ పెద్ద రచ్చ రచ్చ అయ్యింది.

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించిన మీరా చోప్రా పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో కూడా నటించింది. నితిన్ మారో సినిమాలోనూ చేసింది. అలాంటి ఆమెకు ఎన్టీఆర్ ఎవరో తెలియదా ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే ఆమెను కామెంట్లతో భయపెట్టేశారు. దీంతో ఆమె దిగి వచ్చింది. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది.

ఈ విషయంలోకి మరో హీరోయిన్ ఎంటర్ అయ్యి మీరా చోప్రాపై విరుచుకుపడుతూ ఎన్టీఆర్‌కు సపోర్ట్ చేయడం కూడా హైలెట్ అయింది. ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తూ మీరాచోప్రాపై విరుచుకుపడిన ఆ హీరోయిన్ ఎవరో కాదు పాయల గోష్. మంచు మనోజ్ ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన పాయల్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో రెండో హీరోయిన్ గా చేసింది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus