Meghana Lokesh: వైరల్ అవుతున్న మేఘనా లోకేష్ వీడియో.. అసలేం జరిగిందంటే..?

  • November 19, 2022 / 08:18 PM IST

మేఘనా లోకేష్.. తెలుగు టీవీ ప్రేక్షకులకు ఈమె గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. పలు పాపులర్ సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ‘కల్యాణం కమనీయం’ సీరియల్‌లో నటిస్తున్న మేఘన రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఓ వీడియో చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అసలు మేటర్ ఏంటనేది తెలిసింది.. వివరాల్లోకి వెళ్తే.. ఒకప్పుడు టీవీ ఆర్టిస్టులందరూ సీరియల్స్ లోనో, షోస్‌లోనో కనిపించేవారు.

ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది.. ప్రొఫెషన్‌ పరంగా సీరియల్స్ చేస్తూనే.. ప్యాషన్‌గా, సొంతగా యూట్యూబ్ ఛానెల్స్ కూడా పెట్టేసుకుంటున్నారు. దీని ద్వారా మిలియన్ల కొద్దీ వ్యూస్.. దానితోపాటు అదనంగా రెవెన్యూ ప్లస్ మరికొంత పాపులారిటీ తెచ్చేసుకుంటున్నారు. మేఘనాకు కూడా ఓ ఛానెల్ ఉంది.. జనరల్‌గా డైలీ కొత్త కంటెంట్ దొరకడం అంటే కష్టం కాబట్టి .. కొత్తదనం, క్రియేటివిటీ అంతా థంబ్ నెయిల్స్ మీద చూపిస్తుంటారు.. ఇప్పుడలాంటి పనే చేసిందామె.. దీంతో కొందరు ఆమెను ట్రోల్ చేస్తుంటే.. కొంతమంది మాత్ర నవ్వేసి ఊరుకుంటున్నారు.

కంటెంట్ ఏంటంటే.. సీరియల్ షూటింగ్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే మేఘన.. ఓ రోజు ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది. ఆ సమయంలో భర్త కూడా ఆఫీస్‌కి వెళ్లిపోవడంతో.. ఫ్రెండ్స్‌కి ప్రాంక్ కాల్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. అలాగే తన సహ నటులకు కొందరికి కాల్ చేసింది. వాళ్లలో కొంతమంది నంబర్స్ కాల్ వెయిటింగ్ రాగా, మరికొందరివి కనెక్ట్ కాలేదు. చివరికి మేఘన ఫ్రెండ్, నటి స్వర్ణ.. కాల్ బ్యాక్ చేసింది.

ఆమెతో మేఘనా.. ‘‘ఇంట్లో ఎవరూ లేరు. నీరసంగా అనిపిస్తోంది. చచ్చిపోతానేమో’’ అని చెప్పింది. దీంతో అవతలవైపు ఉన్న స్వర్ణ.. ఇదంతా పర్ఫార్మెన్స్ అని తెలియక పాపం తెగ కంగారు పడిపోయింది.. ‘‘ఇప్పుడే వస్తున్నా.. కాల్ కట్ చేయ్యకు’’ అంటూ బాధ పడిపోయింది. చివర్లో.. ఇది ప్రాంక్ కాల్ అని మేఘన చెప్పడం.. స్వర్ణ కాల్ కట్ చేయడం.. తర్వాత మేఘన వీడియో కాల్ చేయడం.. అసలు విషయం తెలిసి స్వర్ణ తిట్టడం.. ఇలా కాస్త టెన్షన్‌తో పాటు ఫన్నీగా ఉన్న మేఘన ప్రాంక్ కాల్ వీడియో నెటిజన్లను ఆకట్టకుంటుంది..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus