‘ఖుషి’ నటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్.!

వయసుమీదపడినప్పటికీ కొంతమంది నటీమణులు ఇప్పటికీ పెళ్లి ఊసెత్తకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. సితారతో మొదలుపెట్టుకుంటే ఈ లిస్ట్ చాలా పెద్దదనే చెప్పాలి. అయితే ఇప్పుడు మనం ముంతాజ్ గురించి చెప్పుకోబోతున్నాం.2000 వ సంవత్సరంలో లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వడ్డే నవీన్, శ్రీకాంత్..లు హీరోలుగా రూపొందిన ‘చాలా బాగుంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ తర్వాత 2001 లో వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ‘ఖుషి’ (Kushi)  మూవీలో కూడా ఓ చిన్న పాత్ర పోషించింది. అలాగే ఓ పాటలో కూడా ఆడిపాడింది.

అలాగే అదే ఏడాది వచ్చిన ‘ఆమ్మో ఒకటోతారీఖు’ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించింది. వీటితో పాటు మోహన్ బాబు (Mmohan Babu) నటించిన ‘కొండవీటి సింహాసనం’ , పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi), మహేష్ బాబు (Mahesh Babu) ‘ఆగడు’ (Aagadu) వంటి సినిమాల్లో కూడా ఈమె నటించి మెప్పించింది. అయితే ముంతాజ్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఆమెకు ఆటో ఇమ్యూన్ అనే వ్యాధి ఉందట. దీని వల్ల ఆమెకు ఎముకల జాయింట్స్ లో విపరీతమైన నొప్పి వస్తుంటుందట.

తన అన్న సపోర్ట్ కనుక లేకపోతే ఎప్పుడో సూసైడ్ చేసుకుని చనిపోయి ఉండేదాన్ని అంటూ ఈమె ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని.. పెళ్లి చేసుకుని ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టంలేదని, తనకి పెళ్లవుతుంది అనే నమ్మకం కూడా ఇప్పుడు లేదని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ముంతాజ్ (Mumtaj)  వయసు ఇప్పుడు 43 ఏళ్ళు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus