Nalini: రాధికా పై సీనియర్ నటి నళిని షాకింగ్ కామెంట్స్ వైరల్!

సీనియర్ నటి నళిని అందరికీ సుపరిచితమే. చెన్నైలో పుట్టిపెరిగినప్పటికీ.. తెలుగులోనే బాగా ఫేమస్ అయ్యింది. ‘సంఘర్షణ’ ‘తోడు నీడ’ ‘ప్రేమ సాగరం’ ‘బందిపోటు సింహం’ ‘ఊహా సుందరి’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.’వీడే’ ‘కిక్’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్ట్ గా కూడా చేసింది. ఈమె తండ్రి మూర్తి, తమిళ సినిమాలకి కొరియోగ్రాఫర్ గా చేసేవారు. ఈమె తల్లి ప్రేమ ప్రొఫెషనల్ డ్యాన్సర్. నళిని 1987లో నటుడు రామరాజన్‌ను వివాహం చేసుకుంది.

వీరికి కవలలు ఉన్నారు. ఓ పాప మరియు ఓ బాబు.. వాళ్ళ పేర్లు అరుణ మరియు అరుణ్. నళిని, రామరాజన్ 2000లో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ నటి రాధికా పై షాకింగ్ కామెంట్లు చేసింది. నళిని విడాకుల సమయంలో రాధిక .. ఈమె కాపురం చక్కదిద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందట. ‘నళిని అభం, శుభం తెలియని అమ్మాయి. అతన్ని ఎందుకు బాధపెడతారు.

మీకు మనస్సాక్షి అనేది లేదా’ అంటూ (Nalini) నళిని భర్తకి రాధిక చెప్పేదట. అయినా వినకపోవడంతో రాధికాకి కోపం వచ్చిందట. అంతేకాదు నళిని భర్త హద్దులు మీరు మాట్లాడటంతో .. రాధిక చెయ్యి చేసుకుందట. అలాంటి సమయంలో తన సోదరిలా అండగా నిలబడిందట రాధికా. ‘నా కుటుంబంలో వాళ్ళు కూడా నా గురించి అంత గొప్పగా చెప్పింది మాట్లాడింది’ అంటూ ఎప్పుడూ లేదు. కానీ రాధిక నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలబడింది అంటూ నళిని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus