ఇప్పుడున్న కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దానిని అరికట్టడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ ను ఏర్పాటు చేసాయి. మొదట ఏప్రిల్ 14 వరకే అని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తరువాత మే 3 వరకూ దానిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉండగా … లాక్ డౌన్ కారణంగా డైలీ ఇన్కం పై ఆధారపడిన వారు.. నిత్య అవసరాలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి తరుణంలో సినీ సెలబ్రిటీలు మేమున్నాం అంటూ వారికి తోచిన సాయం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓ హీరోయిన్ కాల్ సెంటర్ లో పనిచేస్తుందట.అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘మేడ మీద అబ్బాయి’ అలాగే ‘గాయిత్రి’ వంటి సినిమాల్లో నటించిన నిఖిల విమల్.. కేరళ ప్రభుత్వం వారు కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ కోవిడ్-19 కాల్ సెంటర్ ఏర్పాటు చేసారు. ఆ కాల్ సెంటర్ లో పనిచేస్తూ హీరోయిన్ నిఖిల విమల్.
ఆపదలో ఉన్న వారికి ఈ వేదికగా హెల్ప్ చేస్తోందట. ప్రజలకు కావాల్సిన అవసరాలు ఈ సేవా కేంద్రానికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన వాలంటీర్ల ద్వారా… ఈమె ప్రజలకు సాయం చేస్తుందట. ఈ మేరకు రోజుకి 20 కిలో మీటర్లు ప్రయాణం చేస్తుందని తెలుస్తుంది. ఏమైనా ఈమె గొప్ప మనసుకి అందరూ ప్రసంసలు కురిపిస్తున్నారు.