Nivetha Pethuraj: విశ్వక్ సేన్ సినిమాల్లో నటించను.. నివేదా పేతురాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విశ్వక్ సేన్ (Vishwak Sen) టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో. సినిమాలకు సంబంధించిన వార్తలతో పాటు వివాదాలతో కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు ఈ యంగ్ హీరో. తన సినిమాలను వింతగా ప్రమోట్ చేస్తూ గతంలో చాలా వివాదాలకు తెరలేపాడు. కంటెంట్ వెళ్లాలంటే దానికి ముందు ఓ కాంట్రోవర్సీ జరగాలి అని బలంగా నమ్మే రకం ఇతను. అందుకే ప్రేక్షకులు.. ఇతని సినిమాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. ఈ మధ్య విశ్వక్ సేన్ నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు అందుకున్నవే.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్.. గతంలో ఓ హీరోయిన్ తో డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్ మరెవరో కాదు నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) . విశ్వక్ సేన్ తో ఈమె ‘పాగల్’ (Paagal) ‘దాస్ కా ధమ్కీ’  (Das Ka Dhamki) వంటి సినిమాల్లో నటించింది. అయితే వీరిద్దరూ ‘భూ’ (Boo) అనే సినిమాలో కూడా నటించారు. కానీ అందులో ఇద్దరికీ కాంబినేషనల్ సీన్స్ ఉండవు.

అమలా పాల్ (Amala Paul) మాజీ భర్త ఏ.ఎల్.విజయ్ (AL Vijay) డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. కానీ అసలు పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అవ్వడంతో జనాలు దీనిని పట్టించుకోలేదు. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటించినట్టు కూడా నివేదా పేతురాజ్ కి తెలీదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘విశ్వక్ సేన్ తో మూడు సినిమాల్లో నటించారు కదా’ అని ఓ యాంకర్ ప్రశ్నించడంతో నివేదా ఆశ్చర్యపోయింది.

‘దాస్ కా ధమ్కీ’ ‘పాగల్’ రెండు సినిమాల్లోనే కదా విశ్వక్ సేన్ తో కలిసి నటించాను అంటూ ఆమె ఎదురు ప్రశ్నించింది. కానీ ఆ యాంకర్ ‘భూ’ ప్రస్తావన తీసుకురాగా.. ‘విశ్వక్ ఆ సినిమాలో నటించినట్టు నాకు తెలీనే తెలీదు’ అంటూ సమాధానం ఇచ్చింది. తర్వాత ఆ యాంకర్ మీ కాంబోలో నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని ప్రశ్నించగా ‘విశ్వక్ తో ఇక నేను సినిమాలు చేయను’ అంటూ ఫన్నీగా సేఫ్ ఆన్సర్ ఇచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus