యువ నటి మృతి.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని కుటుంబం!

ఓ యువ నటి చనిపోయి, మృతదేహం కుళ్లిపోయే స్థితికి చేరుకున్న ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. ఆ నటి గురించి తెలిశాక ఇప్పుడు సోషల్‌ మీడియా ఆమె గురంచే మాట్లాడుకుటోంది. ఆమెనే బాలీవుడ్ నటి నూర్‌ మాలబికా దాస్‌. ఆమె ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఉంటున్న ఫ్లాట్‌ నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్సాంకు చెందిన నూర్‌ మాలబికా దాస్‌ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంది.

దీని కోసం ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చాలా కాలంగా ఉంటోంది. ఇటీవల ఆమె ఫ్లాట్‌ నుండి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా, ఆమె మృతదేహం కుళ్లిపోయే స్థితికి చేరింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. నూర్‌ మాలబికా దాస్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే వృద్ధాప్య దశలో ఉన్న ఆమె తల్లిదండ్రులు ఇటీవలే ముంబయికి తిరిగి సొంతూరుకు వచ్చివెళ్లారు. అంతేకాదు కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మళ్లీ తాము రాలేమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో నూర్‌ స్నేహితుడు, నటుడు అలోక్‌నాథ్‌ పాఠక్‌ అంత్యక్రియలు పూర్తి చేశారు. నూర్‌ మాలబికా దాస్‌ గతంలో ఖతర్‌ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేసింది.

ఆ తర్వాత నటనపై ఆసక్తితో ముంబయికి వచ్చేసింది. ప్రముఖ నటి కాజోల్‌ నటించిన ‘ది ట్రయల్‌’ వెబ్‌ సిరీస్‌తోపాటు ఇతర వెబ్‌ షోల్లో పాల్గొంది. నూర్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, హోం మంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లను ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌, నెటిజన్లు కోరుతున్నారు. మరికొందరు గతంలో ఇదే తరహాలో కాకపోయినా ఇలానే చనిపోయిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus