అందం అంటే పిచ్చి, ఆరోగ్యం అంటే శ్రద్ద ఉంటే చాలు. 50ఏళ్ళు దాటినా కూడా సన్నజాజి పువ్వులా ఉండవచ్చు. బాలీవుడ్ లో అనేక మంది హీరోయిన్స్ 45 ప్లస్ లో 50కి దగ్గర్లో ఉన్నారు. అయినా ఎప్పటికి వన్నె తరగని అందంతో కట్టిపడేస్తున్నారు. మలైకా అరోరా, ఐశ్వర్యా రాయ్, శిల్పా శెట్టి మరియు మందిరా బేడీ ఇందుకు ఉదహారణలు. మనసును యవ్వనంగా ఉంచుకుంటే మన శరీరం కూడా యవ్వనంగా కనిపిస్తుంది. మరి అలాంటి అరుదైన అందాలతో అమెరికన్ నటి పద్మ లక్ష్మీ అలరిస్తుంది.
50 ఏళ్ళ వయసులో జస్ట్ 30లా ఫీలవుతున్నాని సోషల్ మీడియా స్టేట్మెంట్స్ ఇస్తుంది. అలాగే తనకు ఇప్పుడే పుట్టినట్టుందని, బికినీ ఫోటో పంచుకోవడంతో పాటు తాను స్టిల్ యంగ్ అంటుంది. 50ఏళ్ల వయసంటే జీవితంలో ముప్పాతిక అయిపోయినట్లే. కానీ ఈ వయసులో కూడా కట్టిపడేసే అందాలతో పద్మ లక్ష్మీ ఇప్పటి జనరేషన్ కి సవాలు విసురుతుంది. సెప్టెంబర్ 1కి 50ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టిన పద్మ లక్ష్మీ అందంలో తనకు తిరుగులేదని నిరూపిస్తుంది.
పుట్టిన రోజు సంధర్భంగా ఈమె చేసిన ట్విట్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చెన్నైకి చెందిన పద్మ లక్ష్మీ చిన్నతనంలోనే అమెరికా వెళ్లి సెటిల్ అయ్యింది. పద్మ నటిగానే కాకుండా టీవీ హోస్ట్ గా, రచయితగా, సామాజికవాదిగా పలురంగాలలో రాణిస్తుంది. 2004లో ఈమె ప్రముఖ రైటర్ సల్మాన్ రష్దిని వివాహాం చేసుకొని, తరువాత విడిపోయారు. ఏడేళ్ల ప్రాయంలో లైంగిక దాడికి గురయ్యానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు.