సినీ పరిశ్రమను విషాదాలు ఇప్పట్లో వదిలిపెట్టేలా లేవు. రోజూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. మే నెలలో ఆల్రెడీ.. వనిత విజయ్ కుమార్ మాజీ భర్త పీటర్ పాల్, ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య, సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడి కొడుకు ,బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తండ్రి వీరేంద్ర ఖురానా అలియాస్ పి.ఖురానా, సీనియర్ నటుడు శరత్ బాబు,బెంగాలీ నటి సుచంద్ర దాస్‌గుప్తా,ఆర్.ఆర్.ఆర్ నటుడు స్టీవెన్ సన్, నటి వైభవి వంటి వారు మరణించారు. మరో నటి ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది.
వివరాల్లోకి వెళితే.. తమిళ నటి పవిత్ర లక్ష్మి (Pavithra Lakshmi) ఇంట్లో విషాదం చోటుచేసుకుందట. ఆమె తల్లి మరణించినట్లు సమాచారం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వారం రోజుల క్రితమే మరణించారట. కాకపోతే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పవిత్ర లక్ష్మీ తన ఇన్స్టాగ్రామ్ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ…. ” 7 రోజుల నుండి నేను ఈ బాధలో నుండి బయటపడాలని చూస్తున్నా..
నువ్వు నన్ను విడిచి వెళ్లిపోయి వారం రోజులు అవుతుంది అంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంది.మరోపక్క నువ్వు నన్ను ఎందుకింత త్వరగా వదిలి వెళ్లిపోయావో నాకు అర్థం కావడం లేదు. గత 5 ఏళ్లుగా నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు.. నువ్వు ప్రస్తుతం ఉన్న చోటులో ఉండవని అనుకుంటున్నాను.నాకు నువ్వు అద్భుతమైన తల్లివి. సింగిల్ పేరెంట్‌గా ఉంటూ బిడ్డల్ని చూసుకోవటం మామూలు విషయం కాదు. నాకు నిన్ను ఓ సారి చూడాలని ఉంది.
నీతో ఓ సారి మాట్లాడాలని ఉంది. నీ చేతి ముద్ద తినాలని ఉంది.కానీ, నాకు ఆ అవకాశం లేదు. నువ్వు ఎప్పటికీ నా వైపు ఉంటావని అనుకుంటున్నాను. ఈ కష్టకాలంలో నాతో ఉన్న వారందరికీ ధన్యవాదాలు. నేను కొన్ని కాల్స్, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేకపోయాను. క్షమించండి. నేను ఇందులోంచి బయటపడడానికి చూస్తున్నాను. నేను త్వరలో మీకు టచ్‌లోకి వస్తాను’’ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది పవిత్ర లక్ష్మి.