Pooja Hegde: నడవలేని స్థితిలో పూజాహెగ్డే ఏమైందంటే?

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘రాధే శ్యామ్’ ‘బీస్ట్’ ‘ఆచార్య’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలు ఏవీ విజయం సాధించలేదు. అయినా ఈమె స్టార్ డం కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క సల్మాన్ ఖాన్ కు జోడీగా ‘కిసి క బాయ్ కిసి క జాన్’ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ఈ చిత్రంలో వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కి అన్న పాత్రలో వెంకీ కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 13న పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా వెంకీ, సల్మాన్ లు కలిసి ఆమె పుట్టినరోజు వేడుకలు సెట్లోనే నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. తాజాగా పూజా హెగ్డే షూటింగ్లో భాగంగా గాయపడిందట. ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే… తాజాగా ఇన్స్టాగ్రామ్లో పూజా హెగ్డే ఓ ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఆమె కాలికి కట్టు కట్టి ఉంది. ‘లిగ్మెంట్ టియర్’ అయ్యిందని ఈ ఫోటో ద్వారా ఆమె చెప్పుకొచ్చింది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నట్టు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే ఈ గాయం ఎలా అయ్యింది అన్న విషయాన్ని మాత్రం ఈమె చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus