Poorna Wedding : చాలా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పూర్ణ… ఫోటోలు వైరల్…!

‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చిన పూర్ణ…ఆ తరువాత అల్లరి నరేష్‌తో ‘సీమటపాకాయ్’ అనే చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘అవును’ ‘అవును 2’ సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇక అటు తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది కానీ అవి సక్సెస్ కాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ‘అఖండ’ దృశ్యం2′ వంటి సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఇక బుల్లితెరపై కూడా బిజీ బిజీగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

ఢీ వంటి షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈమె పెళ్లి యూఏఈ కి చెందిన బిజినెస్మెన్ షానిద్‌ అసిఫ్‌ అలీతో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.జేబీఎస్‌ గ్రప్‌ ఆఫ్‌ కంపెనీలకు ఇతను సీఈఓ. జమా అల్ మెహరి అనే సంస్థని కూడా స్థాపించి….కొత్త ఆఫీస్ లు ప్రారంభించడానికి కావలసిన సర్వీసులను ప్రొవైడ్ చేస్తున్నాడు.అంతేకాకుండా సెలబ్రిటీలకు యూఏఈ వీసాలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు. వీసా ప్రాసెసింగ్‌ అలాగే ఫ్లైట్‌ టికెటింగ్‌ వంటి పలు సర్వీసులను కూడా షానిద్‌ కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది.

కాజల్‌, ప్రియమణి, ప్రణిత, ఆండ్రియా, లక్ష్మీ, విజయ్‌ సేతుపతి, స్వేతా మీనన్‌, నాజర్‌, అజారుద్దీన్‌ వంటి స్టార్లకు యూఎఈ వీసాలను ఏర్పాటు చేశారు. యూఏఈ ముస్లిం మత పెద్దలతో కూడా ఈయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.పూర్ణ కుటుంబంతో ముందు నుండి ఇతనికి పరిచయం ఉండడంతో పూర్ణతో ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అది కాస్త ప్రేమగా ఏర్పడింది.

ఇదిలా ఉండగా వీరి పెళ్లి చాలా సైలెంట్ గా జరిగిపోయింది. అక్టోబర్ రెండో వారంలోనే వీరి వివాహం కొద్దిపాటి బంధు మిత్రుల సమక్షంలో జరిగిపోయిందట.ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus