బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పూర్ణ కొద్ది రోజుల క్రితం దుబాయ్ బేస్డ్ బిజినెస్మెన్ షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్నసంగతి తెలిసిందే.. మోడల్‌గా, నటిగా మరియు క్లాసికల్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ అసలు పేరు షామ్మా కాసిం.. మదర్ టంగ్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ సినిమాల్లోనూ నటించింది. రియాలిటీ షో జడ్జిగానూ ప్రేక్షకులను అలరించింది. దుబాయ్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సమక్షంలో, అరబిక్ పద్ధతిలో ఆమె వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది.
పెళ్లికి పూర్ణ ధరించిన బంగారు ఆభరణాలను ఆమె భర్త కానుకగా ఇచ్చాని.. ఆ జువెలరీ అంతా కలిపితే దాదాపు 1700 గ్రాములు (170 తులాలు) అని, అలాగే ఈ బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లాను కూడా పూర్ణకు ఆమె భర్త గిఫ్ట్‌గా ఇచ్చాడని వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే త్వరలో పూర్ణ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్నారు. ఇటీవల ఆమె సీమంతం ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్ణ, మెరూన్ కలర్ బెనారస్ శారీలో మెరిసిపోయింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తనకు విషెస్ తెలియజేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ‘దసరా’ మూవీలో పూర్ణ విలన్‌గా కనిపించనుందని సమాచారం.