Poorna: ఘనంగా పూర్ణ కొడుకు బారసాల వేడుక .. ఫోటోలు వైరల్.!

షామ్నా కాసిమ్.. తెలుగు ప్రేక్షకులకు పూర్ణగా.. ఎక్కువ పరిచయం. ‘శ్రీమహాలక్ష్మీ’ ‘సీమ టపాకాయ్’ వంటి చిత్రాలతో పాపులర్ అయిన ఈమె హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్లో రాణించింది. 2022 జూన్ నెలలో దుబాయ్ బేస్డ్ బిజినెస్‌మెన్ షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూర్ణ. వీరి వివాహం కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. పూర్ణది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే.షానిద్ ఆసిఫ్ అలీకి టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది తెలుసు.

వారందరికీ వీసాల కోసం ఇతన్నే సంప్రదిస్తూ ఉంటారు. అలాగే అరబ్ దేశాల్లో ఉన్న ముస్లిం పెద్దలందరితో కూడా ఇతనికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక పూర్ణ అటు తర్వాత గర్భవతి అయిన సంగతి తెలిసిందే. తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూనే వచ్చింది. అలాగే సీమంతం ఫోటోలను కూడా షేర్ చేసుకుంది.ఏప్రిల్ 4న పూర్ణకి డెలివరీ అయిన సంగతి తెలిసిందే. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఇక పూర్ణ (Poorna) కొడుకు బారసాల వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఫొటోల్లో తన కొడుకు మొహాన్ని చూపించింది పూర్ణ. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు బాబుకి బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నారు. పూర్ణ ఈ మధ్యనే ‘దసరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో విలన్ భార్యగా అలాగే హీరోకి సాయం చేసే వ్యక్తిగా సపోర్టింగ్ రోల్ ప్లే చేసింది. ఈ విషయాలను పక్కన పెట్టేసి పూర్ణ కొడుకు బారసాల ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

 

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus