హీరోయిన్ కావాల్సిన నేను తల్లి అయ్యాను!

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంది హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించి ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రగతి ఒకరు. ఇలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించాలని చెప్పాలి. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె జిమ్ లో భారీ స్థాయిలో వర్కౌట్లు చేస్తూ కష్టపడుతున్నారు.

ఇలా ఫిట్నెస్ కోసం ఈమె నాలుగు పదుల వయసులో కూడా తన వయసును ఏమాత్రం లెక్క చేయకుండా అధిక బరువులు ఎత్తుతూ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి పోటీలలో కూడా ఈమె వెయిట్ లిఫ్ట్ లో భాగంగా కాంస్య పథకాన్ని కూడా సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమాలకు కాస్త దూరమైనటువంటి ప్రగతి జిమ్ లోనే భారీగా కష్టపడుతున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినిమా కెరియర్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. ఒక వ్యక్తి సలహా వల్ల తాను చిన్న వయసులోనే తల్లిగా మారాల్సి వచ్చింది అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలపై ఆసక్తితో తాను హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగడం కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు. అయితే ఒక వ్యక్తి సలహా కారణంగా తాను హీరోయిన్ ఛాన్సులు వదులుకోవాల్సి వచ్చింది.

హీరోయిన్ గా నటిస్తే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగలేమని అలాగే అవకాశాలు కూడా చాలా తక్కువగా వస్తాయని తెలిపారు. అలాగే తల్లి పాత్రలలో అయితే కనుక ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగవచ్చు అంటూ సలహా ఇవ్వటం వల్ల తాను హీరోయిన్ గా కాకుండా తల్లి పాత్రలలో నటించడానికి సిద్ధమయ్యానని అలా చిన్న వయసులోనే తాను తల్లి పాత్రలలో నటించాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా ప్రగతి (Pragathi) తెలిపారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus