గతేడాది కరోనా వచ్చిన సమయంలో హీరోయిన్లంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలందరూ కూడా ఇదే చేశారు. ఒక్క సోనూసూద్ మాత్రమే తనవంతుగా సాయం చేశారు. అలాంటి సమయంలో హీరోయిన్ ప్రణీత బయటకొచ్చి సేవలందించింది. లాక్ డౌన్ లో మాస్క్ పెట్టుకొని ఎంతోమందికి ఆహరం అందించింది. ఇప్పుడు మరోసారి తన ఛారిటీ కార్యక్రమాలను మొదలుపెట్టింది. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండడంతో ఈసారి తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించింది.
కేవలం అన్నార్తులకు ఆహరం అందించడంతోనే ఆగిపోకుండా.. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దిశగా కూడా తన సేవా కార్యక్రమాలను ఉధృతం చేసింది. మొదటి వేవ్ లో కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చామని.. అవసరమైన వాళ్లందరికీ ఆహారం అందించామని చెప్పింది. సెకండ్ వేవ్ లో కూడా ఏదైనా చేయాలనిపించి.. ఈసారి ఆహరం కంటే ఆక్సిజన్ అవసరం అనిపించి.. తన ఛారిటీ ద్వారా డబ్బు పోగు చేశామని వెల్లడింది.
ఆ విరాళంతో అవసరమైన వాళ్లకు ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపింది. సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారిందని.. తన వలన కుటుంబసభ్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో సెలబ్రిటీలంతా తమకు తోచిన రీతిలో సమాజానికి మంచి చేయాలని కోరింది ప్రణీత. ఈమె చేస్తోన్న సేవలను గుర్తించిన నెటిజన్లు.. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!