‘మళ్ళీ రావా’ ఫేమ్ ప్రీతీ అస్రాని స్పెషల్ ఇంటర్వ్యూ..!

  • February 14, 2020 / 01:50 PM IST

‘అభిషేక్ పిక్చర్స్ ‘ సమర్పణలో ‘కరంపురి క్రియేషన్స్’ మరియు ‘మైక్ మూవీస్’ సంస్థలు కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. సుజోయ్ అండ్ సుశీల్ అనే ఇద్దరు దర్శకులు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కాబోతుంది. సాయి రోనాక్, ప్రీతీ అస్రాని జంటగా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కాగా ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ ప్రీతి అస్రాని పాల్గొని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది :

ఇండస్ట్రీలో మీ ఎంట్రీ గురించి చెప్పండి.!


నేను గుజరాతి అమ్మాయిని… సినిమాల పై ఉన్న ఆసక్తి వల్ల హీరోయిన్ గా మారాను. మొదట ‘ఫిదా’ అనే షార్ట్ ఫిలింలో నటించాను. తరువాత ‘మళ్ళీరావా’ సినిమాలో నటించాను. హీరోయిన్ గా ఇదే నా మొదటి చిత్రం. ఇక ఇండస్ట్రీలో నేను ఎంట్రీ ఇచ్చింది… నా సిస్టర్ అంజు అస్రాని వల్లే..! ఆమె ఓ సీరియల్ ఆర్టిస్ట్.. అలాగే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో జర్నలిస్ట్ రోల్ కూడా చేసింది.

‘ప్రెజర్ కుక్కర్’ టైటిల్ పెట్టడానికి కారణం..!


ఇందులో హీరోకి లైఫ్ పట్ల సరైన అవగాహన ఉండదు. కేవలం తన తండ్రి ఏం చెబితే అది గుడ్డిగా చేస్తుంటాడు. ఇష్టం లేకపోయినా పేరెంట్స్ చెప్పిందే చేస్తూ ప్రెజర్ ఫీలవుతాడు కాబట్టి.. ‘ప్రెజర్ కుక్కర్’ అని పెట్టారు.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది?


కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇందులో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, రొమాన్స్ కూడా ఉంది. చెప్పాలంటే చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది.

ఈ చిత్రంలో మీ పాత్ర గురించి చెప్పండి?


ఈ చిత్రంలో నా పేరు అనిత. ఓ సోషల్ యాక్టిస్ట్ రోల్. ఈ పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలంగాణ స్లాంగ్ లో కూడా మాట్లాడాను. నేను డ్యాన్స్ కూడా బాగా చేస్తాను.. కానీ ఈ సినిమాలో డ్యాన్స్ చేసే పాటలు లేవు.

మీరు నార్త్ అయ్యుండి.. తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారు..?

నేను టెన్త్ క్లాస్ నుండీ హైదరాబాద్ లోనే ఉండేదాన్ని. ‘పక్కింటి అమ్మాయి’ అనే సీరియల్ లో కూడా నటించాను. అలా తెలుగు పూర్తిగా వచ్చేసింది.

తనికెళ్ళ భరణి గారు వంటి సీనియర్ యాక్టర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

ఆయనకీ, నాకు కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ ఉంటాయి. మహా అయితే రెండు, మూడు ఉంటాయేమో. ఆయన షూటింగ్ రావడమే.. అందరిలోనూ జోష్ నింపుతుంటారు. ఈ సినిమాలో ఆయన కామెడీ కూడా బాగా ఆకట్టుకుంటుంది.

మీరు థియేటర్ ఆర్టిస్టా?


కాదండీ.. నేను థియేటర్ ఆర్టిస్ట్ కాదు.!

డైరెక్టర్స్ గురించి చెప్పండి?

ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్… సుజోయ్ అండ్ సుశీల్ సార్. సీన్ స్టార్ట్ చేసే అప్పుడు ఒక్కరే ఉంటారా.. ఇద్దరూ ఉంటారా అని డౌట్ ఉండేది. ఇద్దరూ కూర్చున్నారు. రెండు మూడు టేక్ లైనా షాట్ కరెక్ట్ గా వచ్చేలా చూసుకునే వారు.

– Phani Kumar

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?


ప్రస్తుతం గోపీచంద్ గారి ‘సీటిమార్’ చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో కబడ్డీ ప్లేయర్ పాత్ర పోషిస్తున్నాను. ప్రస్తుతం ఆ ఒక్క సినిమానే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus