Actress Prema: మోహన్ బాబు అంటే చచ్చేంత భయం… కానీ ఆయనతోనే పోటీ పడ్డాను: నటి ప్రేమ
- October 26, 2022 / 05:50 PM ISTByFilmy Focus
కన్నడ చిత్ర పరిశ్రమకు ఓం అనే సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి ప్రేమ.ఇలా కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు ధర్మచక్రం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ధర్మచక్రం, మా ఆవిడ కలెక్టర్ దేవి, నాగదేవత, వంటి ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ప్రేమ అంటేనే ఎక్కువగా అందరికీ దేవత సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇలా దేవత పాత్రలలో ప్రేమ ఎక్కువగా నటించి సందడి చేశారు.
ఈ విధంగా తెలుగు కన్నడ తమిళ భాషలలో పలు సినిమాలలో నటించిన ఈమె వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే చాలా కాలం తర్వాత ప్రేమ అనుకోని ప్రయాణం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రేమ తన సినీ కెరియర్ గురించి అలాగే నటుడు మోహన్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో తాను నటించిన ఓం సినిమా చూసి రామానాయుడు గారు తనకు ఫోన్ చేసి తనకు మరి ధర్మచక్రం సినిమాలో అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ప్రేమ తెలిపారు.ఈ విధంగా ధర్మ చక్రం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన తనకు ఎక్కువగా దేవత సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు మోహన్ బాబు అంటే చచ్చేంత భయమని ఆయన వంక చూస్తూ మాట్లాడాలన్న చాలా భయపడే దాన్ని అంటూ తెలిపారు.

ఈ విధంగా మోహన్ బాబు అంటే ఎంతో భయం ఉన్న తనకు రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఏకంగా నెగిటివ్ పాత్రలో నటిస్తూ ఆయనతో పోటీ పడ్డానని ఈ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి ప్రేమ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇక తాను నటించిన దేవత పాత్రల గురించి మాట్లాడుతూ.. ఈ పాత్రలలో నటించేటప్పుడు తాను నిజంగానే దేవత అనే భావన తనలో కలుగుతుందని అలాంటి ఫీలింగ్ కలిగినప్పుడే ఆ పాత్రలో లీనమై నటించగలుగుతామంటూ ఈమె తెలియజేశారు.
జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!











