Actress Prema: హీరోయిన్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడం గురించి ప్రేమ చెప్పిందంటే..!

నటి ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా పరిచయం అక్కర్లేదు.. మాతృభాష కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసి.. శివరాజ్ కుమార్, విష్ణువర్థన్, ఉపేంద్ర, రమేష్ అరవింద్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించింది.. కన్నడలో పలు చిత్రాలు చేసి పేరు తెచ్చుకుంది.. విక్టరీ వెంకటేష్ ‘ధర్మచక్రం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీతోనే పరిశ్రమని ఆకట్టుకుంది.. అక్కడినుండి వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.. మరీ ముఖ్యంగా ‘దేవి’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకలోకానికి మరింత చేరువైంది..

ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడం.. వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోవడం లాంటి కారణాలతో.. ‘చిరునవ్వుతో’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’, ‘ఢీ’ లాంటి మూవీస్‌ చేశాక ఇక్కడ ఫేడవుట్ అయిపోయింది. మధ్యలో కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవలే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘అనుకోని ప్రయాణం’ లో చేేసింది. ఆమె కథానాయికగా కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే సహాయనటిగా ఎందుకు మారింది? అనే సందేహం చాలామందికి ఉంది..

ఆ ప్రశ్నకు సమాధానం అలీ షోలో దొరికింది.. కామెడీ కింగ్ అలీ నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అలీతో జాలీగా’ షోకి ‘అనుకోని ప్రయాణం’ లో నటించిన సీనియర్ యాక్టర్ నరసింహ రాజుతో కలిసి వచ్చింది ప్రేమ.. ఈ షోలో తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిందామె.. హీరోయిన్‌గా బిజీగా ఉండగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ టర్న్ అవడానికి రీజన్ ఏం చెప్పిందంటే..

‘‘తొట్టెంపూడి వేణు హీరోగా వచ్చిన ‘చిరునవ్వుతో’ సినిమాలో కథలో కీలకంగా ఉంటూ, ఆడియన్స్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ చేశాను. నా రోల్‌కి మంచి పేరు వచ్చింది.. అందులో ‘సంతోషం.. సగం బలం.. హాయిగ నవ్వమ్మా’ సాంగ్ ఇప్పటికీ నా ఫేవరెట్.. ఆ పిక్చర్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయాను’’ అని చెప్పుకొచ్చారు.. ‘చిరునవ్వుతో’ మూవీకి త్రివిక్రమ్ కథ, మాటలు రాయగా.. మణిశర్మ సంగీతమందించారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus