తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటిగా గుర్తింపును సంపాదించుకున్న ప్రేమ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్నిరోజుల నుంచి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో తాజాగా ప్రేమ ఆ వార్తల గురించి స్పందించి వివరణ ఇచ్చారు. తనకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తన గురించి వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని ప్రేమ పేర్కొన్నారు. 2006 సంవత్సరంలో ప్రముఖ బిజినెస్ మేన్ జీవన్ అప్పచును ప్రేమ వివాహం చేసుకున్నారు.
పెళ్లైన కొన్ని సంవత్సరాలకే ప్రేమకు భర్తతో విభేదాలు వచ్చాయి. ప్రేమ భర్తతో ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకోగా తాజాగా ఆమె రెండో పెళ్లికి సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రేమ క్యాన్సర్ తో బాధ పడుతున్నారని కూడా ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజం లేదని ప్రేమ తెలిపారు. పెళ్లి తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ప్రేమ 2017లో మత్తే బా సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తెలుగులో మాత్రం ప్రేమకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.
తెలుగులో దేవి సినిమా ప్రేమకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ప్రేమ భర్తతో విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియలేదు. పెళ్లి, విడాకుల గురించి ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు ఎదురైతే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం ఇష్టం ఉండదని ప్రేమ పేర్కొన్నారు. తనకు పిల్లలున్నారని జరిగిన ప్రచారంలో కూడా నిజం లేదని తాను ఒంటరిగానే జీవనం సాగిస్తున్నానని ప్రేమ చెప్పుకొచ్చారు.