Actress Prema: ఆ కారణంతోనే అరుంధతి పాత్ర మిస్ చేసుకున్నా!

కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అరుంధతి.ఈ సినిమాలో అనుష్క జేజమ్మ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించే సందడి చేశారు. ఇలా అరుంధతి సినిమా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనుష్క అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో అగ్రతారగా వెలిగారు.అయితే తాజాగా అనుష్క నటించిన అరుంధతి సినిమా గురించి నటి ప్రేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రేమ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అరుంధతి సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

కోడి రామకృష్ణ గారితో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని తెలిపారు. దేవి సినిమా షూటింగ్ సమయంలో ఆయన తనకు తెలుగు నేర్పించారని ప్రేమ తెలిపారు. అయితే కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా కోసం ముందుగా తనని సంప్రదించారని ప్రేమ తెలియజేశారు. ఈ సినిమా కథ చెప్పడంతో తనకు చాలా బాగా నచ్చిందని అయితే అప్పటికి తను కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్ కాక ఈ సినిమా అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

కోడి రామకృష్ణ గారు తనకు వరుస కాల్ షీట్స్ అడగడంతో ఇబ్బందిగా మారి తాను ఈ సినిమాని వదులుకున్నానని ప్రేమ తెలిపారు. అయితే సినిమా విడుదలైన తర్వాత చూశానని చాలా అద్భుతంగా ఉందని ఈమె తెలియజేశారు. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని మిస్ చేసుకున్నందుకు తనకు ఏ మాత్రం బాధ లేదని తెలిపారు. ఈ సినిమాలో ఈ పాత్రలో నటించాలని అనుష్కకి రాసిపెట్టి ఉండటం వల్ల ఈ అవకాశం తనకే వెళ్లిందని ప్రేమ తెలిపారు.

ఇక తనకు (Actress Prema) సినిమాలలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదని తాను ఎయిర్ హోస్టెస్ కావాలన్న కోరిక తనలో బలంగా ఉండేదని తెలిపారు. అయితే తన తల్లికి మాత్రం తనని నటిగా చూడాలని కోరిక ఉండడం వల్ల తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని ఈ సందర్భంగా ప్రేమ తెలిపారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus