కుర్ర హీరోయిన్ ఫిజిక్ పై అసభ్యకర కామెంట్స్..!

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం బాగా తగ్గింది. అభిమానులు నేరుగా సెలబ్రిటీలతో మాట్లాడే ఛాన్స్ రావడంతో కొందరు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటుంటే మరికొందరు మాత్రం సెలబ్రిటీలపై కామెంట్స్ చేస్తూ వాళ్లని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా కుర్ర హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ‘ఒరు అడార్’ అనే సినిమాలో కన్నుకొట్టే సీన్ తో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. ఈ సినిమా విడుదలకు ముందే ప్రియాకి వరల్డ్ వైడ్ క్రేజ్ వచ్చింది.

సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అమ్మడుకి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తన క్రేజ్ మరింత పెంచుకోవడానికి రకరకాల ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. రీసెంట్ గా లెహంగా వేసుకొని ఎద అందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు బాగా వైరల్ అవ్వడంతో పాటు ట్రోలింగ్ బారిన పడ్డాయి. ప్రియా ప్రకాష్ శరీరాకృతిపై అసభ్యకర కామెంట్స్ చేశారు కొందరు నెటిజన్లు. మరికొందరు ఆమెని దూషిస్తూ పోస్ట్ లు పెట్టారు. దీంతో ఈ కామెంట్స్ చూసిన ప్రియా కౌంటర్ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టింది.

తనపై వచ్చిన కామెంట్స్ లో పావు వంతు కూడా చూడలేకపోయానని.. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి కూడా ఇలాంటి ఎదురవుతూనే ఉన్నాయని.. వాటిని దాటుకొని ఇక్కడ వరకు వచ్చానని అన్నారు. ఎవరేమన్నా కూడా అందరితో దయగా, గౌరవంగా ప్రవర్తించాలని చిన్నప్పటి నుండే నేర్చుకున్నానని.. మీలాంటి వాళ్లు విమర్శిస్తున్నా.. ఇంత దూరంగా వచ్చినందుకు గర్వంగా ఉందని రాసుకొచ్చింది.

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus