Priya Prakash Varrier: కోలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ టార్గెట్ చేసిన ప్రియా వారియర్!

కన్ను గీటు వీడియోతో దేశం మొత్తాన్ని ఎంతగానో ఆకట్టుకున్న నటి ప్రియా వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కన్నుగీటు వీడియోతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయారు మలయాళీ ముద్దుగుమ్మ.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా పలు అవకాశాలను అందుకున్నప్పటికీ ఈమెకు అనుకున్న స్థాయిలో హిట్ సినిమాలు పడలేదు. ఈ క్రమంలోనే గ్లామర్ షో చేస్తూ కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ప్రియా వారియర్ ఇప్పటివరకు మలయాళం హిందీ తెలుగు భాషలలో నటించినప్పటికీ ఇంకా తమిళ భాషలో అవకాశాలను అందుకోలేక పోతుంది.

ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం ఈ ముద్దుగుమ్మ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను టార్గెట్ చేస్తూ ప్రియ వారియర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఈమె తరచూ సోషల్ మీడియా వేదికగా హీరో ధనుష్ ఫోటోలను షేర్ చేస్తూ ఆయన గురించి పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉంటారు.

ఇదే విషయమే ప్రియ వారియర్ కు మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవగా ఈమె ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ తనకు హీరో ధనుష్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండానే ప్రియా వారియర్ ధనుష్ గురించి పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడమే కాకుండా కానీ తన అభిమాన హీరో అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ధనుష్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ధనుష్ అంటే తనకు అదే రకమైన పిచ్చి అని ఆయన పక్కన నటించాలని కోరిక తనలో బలంగా ఉందని, ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందా, అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నానంటూ ఈ సందర్భంగా ప్రియ వారియర్ ధనుష్ ను టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus