Priyamani: సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

  • June 27, 2023 / 04:11 PM IST

‘ఎవరే అతగాడు’ అనే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. ఆ తర్వాత ‘పెళ్ళైన కొత్తలో’ ‘యమదొంగ’ ‘రగడ’ వాటి చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. కొన్నాళ్ళ వరకు బాగానే రాణించింది కానీ తర్వాత కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చాక ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో ఈమె కన్నడ .. మలయాళ, తమిళ సినిమాలతో కొన్నాళ్ళు బిజీగా గడిపింది. తర్వాత అవకాశాలు లేక కొన్నాళ్ళు ఖాళీగా ఉండి.. అటు తర్వాత .. ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ముస్తఫా రాజ్ బిజినెస్మెన్.. పైగా అతనికి ఇంతకు ముందు వేరే అమ్మాయితో పెళ్లైంది. ఈ విషయం పై ప్రియమణి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. తాజాగా వాటిని మరోసారి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. ‘నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎన్నో విమర్శలు ఫేస్ చేస్తూనే ఉన్నాను. మొదట్లో నా రంగు గురించి చాలా మంది నెగిటివ్ కామెంట్లు చేశారు. ఈమె హీరోయిన్ ఏంటి? అని నా డైరెక్టర్స్ పేరు తెచ్చి మరీ నా పై బ్యాడ్ రిమార్క్ వచ్చేలా కామెంట్లు చేసేవారు.

ఇప్పటికీ నా రంగు గురించి నెగిటివ్ కామెంట్లు చేసే బ్యాచ్ ఉన్నారు. అయితే నేను నా హార్డ్ వర్క్ ను నమ్ముకుని ముందుకు సాగాను. ఇక ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుంటున్నాను అని తెలిసిన వెంటనే ‘ముస్లింని పెళ్లి చేసుకోవడం ఏంటి?’ అంటూ ట్రోల్ చేశారు. నేను అప్పుడు.. ఇప్పుడు అలాంటి నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను అయితే అస్సలు లెక్క చేయను’ అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus