Priyanka Chopra: నటన విషయంలో వారికి చెప్పాల్సిందేమీ లేదు!

బాలీవుడ్ నటి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ప్రియాంక చోప్రా నటి సమంత నటుడు వరుణ్ దావన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం సమంత మయూసైటిసిస్ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈమె రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సిటాడెల్అనే వెబ్ సిరీస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో సమంతతో పాటు నటుడు వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్ హాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే పేరుతో తెరకెక్కి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇందులో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సిరీస్ లో కొన్ని మార్పులు చేసి అదే పేరుతో ఇండియాలో కూడా తెరకెక్కిస్తున్నారు.

అయితే ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించిన పాత్రలో ఇక్కడ సమంత నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ సమంత, వరుణ్ ధావన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. సమంత గొప్ప నటి అలాగే వరుణ్ ధావన్ కూడా ఎంతో అద్భుతమైన నటుడు నటన విషయంలో వీరికి ఏ విధమైనటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈమె తెలియజేశారు. గత కొద్ది రోజుల క్రితం ఒక కార్యక్రమంలో భాగంగా నటుడు వరుణ్ ధావన్ ను తాను కలిశానని, ఈ సిరీస్ షూటింగ్ గురించి అడిగి తెలుసుకున్నానని తెలిపారు.

ఇక డైరెక్టర్ రాజ్ అండ్ డీకే ఎంతో టాలెంట్ కలిగిన దర్శకులని తెలిపారు. ఈ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా వెల్లడించారు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ కోసం సమంత పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తూ కష్టపడుతున్నారు. ఈ సిరీస్ కోసం ఈమె ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా తీసుకున్న విషయం మనకు తెలిసింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus