Raadhika: సీనియర్ నటుడు భానుచందర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

సీనియర్ నటుడు భానుచందర్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. పలు హిట్ సినిమాల్లో హీరోగా నటించాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో నడిచే కథలకి ఇతనే సరైన హీరో అనిపించుకున్నాడు. సుమన్ ఇక్కడ స్టార్ హీరో అయ్యాక..అతని స్నేహితుడైన భానుచందర్ కూడా కొన్నాళ్ల పాటు ఇక్కడ చక్రం తిప్పాడు. హీరోగా అయితే త్వరగానే ఫేడౌట్ అయినప్పటికీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికీ మంచి మంచి సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.

ఇదిలా ఉండగా.. భాను చందర్ తమిళనాడుకి చెందిన వ్యక్తే అయినప్పటికీ అతనికి స్టార్ స్టేటస్ ను కట్టబెట్టింది టాలీవుడ్ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇటీవల భానుచందర్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అతను షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. భానుచందర్ మాట్లాడుతూ .. “భగవంతుడు నీకు అన్నీ ఇచ్చాడు .. ఇంకా ఏం ఇవ్వలేదని ఏడుస్తున్నావ్. జీవితం చాలా చిన్నది .. ఈ కాసేపటికి ఇన్ని బాధలు పడుతూ కూర్చోవడం అవసరమా? మనశ్శాంతి ఉన్నవాడు గొప్పవాడు ..

హాయిగా చనిపోయినవాడు అసలైన శ్రీమంతుడు. జీవితంలో మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాం. కానీ మనల్ని తీసుకెళ్లే అతను మనలను చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ‘కోట్లు సంపాదించేసి .. మంచంలో పడిపోయి .. ఎప్పుడు పోతాడ్రా బాబు’ అని అందరూ ఎదురుచూసేవరకూ ఉండాలా. అలా అస్సలు ఉండకూడదు. నా ఫ్రెండ్ ప్రతాప్ పోతన్ మాదిరిగా నిద్రలోనే ప్రశాంతంగా చనిపోవాలి. బ్రతికినన్నాళ్లు మనశ్శాంతితో బ్రతకడం ..

మనకి తెలియకుండానే మనం పోవడం అనేది ఎంతో గొప్ప భాగ్యం” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ప్రతాప్ పోతన్ అందరికీ తెలుసు కదా. రాధికా (Raadhika)మొదటి భర్త. అలాగే నటుడు, రచయిత, దర్శకుడు కూడా..! గతేడాది జూలై 15 న ఇతను మరణించాడు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus