టాలీవుడ్ ఇండస్ట్రీలో రాశీఖన్నాకు (Raashi Khanna) ఊహించని రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం ఎక్కువ సినిమాలలో నటించలేదు. వరుస ఫ్లాపులు, కొత్త హీరోయిన్ల ఎంట్రీ, ఇతర కారణాల వల్ల రాశీఖన్నాకు ఆఫర్లు తగ్గాయి. స్టార్ హీరోలకు జోడీగా ఎక్కువ సినిమాలలో నటించకపోవడం కూడా రాశీఖన్నాకు మైనస్ అయిందని చాలామంది భావిస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశిఖన్నా షాకింగ్ విషయాలను వెల్లడించారు.
త్వరలో రాశీఖన్నా నటించిన అరణ్మణై4 మూవీ విడుదల కానుంది. ఇందులో తమన్నా మరో హీరోయిన్ గా నటించారు. తమన్నాకు పోటీ రాశీఖన్నా ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించారని సమాచారం అందుతోంది. రాశీఖన్నా మాట్లాడుతూ అభినయ ప్రధాన పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని పేర్కొన్నారు. బాహుబలి లాంటి సినిమాలో నటించాలనే భావన నాకు ఉందని ఆమె తెలిపారు. అలాంటి మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని రాశీఖన్నా వెల్లడించారు.
అరణ్మనై 4 సినిమాలో మంచి పాత్రను పోషించానని ఆమె అన్నారు. ఈ రోల్ తనకు మంచి పేరును తెచ్చిపెడుతుందని భావిస్తున్నానని ఆమె వెల్లడించారు. పెళ్లి ప్రస్తావన గురించి ప్రశ్నలు ఎదురు కాగా ఆ ఒక్కటి మాత్రం అడగొద్దని రాశీఖన్నా వెల్లడించారు. రాశీఖన్నా ఇప్పట్లో పెళ్లికి సంబంధించిన తీపికబురు చెప్పే ఛాన్స్ అయితే లేదని సమాచారం అందుతోంది.
చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా వరుస విజయాలను సొంతం చేసుకుంటుండగా రాశీఖన్నా మాత్రం పెళ్లి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడటం లేదు. రాశీఖన్నాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా తెలుగులో ఈ బ్యూటీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది. రాశీఖన్నా చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు.