Actress Raasi: హీరోయిన్ రాశి బోల్డ్ సీన్ వల్ల మోహన్ బాబు సినిమా బాగా ఆడిందట..!

సినిమాల్లో కథ డిమాండ్ చేస్తే ఎంతైనా ఎక్స్పోజింగ్ చేసే హీరోయిన్లు ఇప్పుడున్నారు. బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఓ రేంజ్లో నటించేస్తున్నారు. కానీ ఒకప్పటి సంగతి వేరు. అప్పట్లో హీరోయిన్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించమంటే చాలా వరకు ఒప్పుకునేవారు కాదు. అలా ఒప్పుకోవాలి అంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలనే కండిషన్ పెట్టేవారు. అంతేకాదు హీరో కూడా తమ ఏజ్ గ్రూప్ అయ్యుండాలి. అప్పుడే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. మరి అలా చేసిందో లేదో తెలీదు కానీ హీరోయిన్ రాశి మోహన్ బాబు సినిమాలో బట్టలు లేకుండా ఓ సన్నివేశంలో నటించింది.

దీంతో ఆ రోజుల్లో పెద్ద వివాదమే చోటు చేసుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ‘పోస్ట్ మాన్’. మోహన్ బాబు హీరోగా ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. 2000 వ సంవత్సరంలో చిరంజీవి ‘అన్నయ్య’, బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’ , వెంకటేష్ ‘కలిసుందాం రా’ చిత్రాలకి పోటీగా రిలీజ్ అయ్యింది ‘పోస్ట్ మాన్’ చిత్రం. ఆ టైంలో ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన (Actress Raasi) రాశి..

ఓ సన్నివేశంలో బట్టలు లేకుండా నటించి అందరికీ షాకిచ్చింది. ‘సతీ అనసూయ త్రిమూర్తలకి అన్నం వడ్డించినట్టు వడ్డించాలి’ అంటూ ఓ సన్నివేశంలో మెయిన్ హీరోయిన్ సౌందర్యతో రాశి పందెం కడుతుంది. ఈ క్రమంలో రాశి ఆ విధంగా నటించాల్సి ఉంది. ఈ సీన్ తొలగించాలని మహిళా సంఘాలు అప్పట్లో గొడవ గొడవ చేశాయి. అలా ఈ సినిమా పై జనాల ఫోకస్ అయ్యింది.

ఈ ఒక్క సన్నివేశం వల్లే అట్టర్ ప్లాప్ అవ్వాల్సిన ఈ సినిమా.. యావరేజ్ టు ఎబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో బయటపడింది. ‘శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ పై మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వందేమాతరం శ్రీనివాస్ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బ్రహ్మానందం కామెడీ ట్రాక్ బాగానే అలరిస్తుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus