సినీనటి రాధ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బుల్లితెర కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాధ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె తిరిగి బుల్లితెరపై పలు డాన్స్ షో లకు జడ్జ్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి రాధ తన కుమార్తె కార్తికను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేశారు.
ఈమె జోష్, దమ్ము రంగం వంటి సినిమాలలో నటించారు. ఇలా పలు సినిమాలలో నటించిన కార్తీక అనంతరం ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈమె ఇండస్ట్రీకి దూరమై పూర్తిగా బిజినెస్ రంగం వైపు అడుగులు వేశారు. బిజినెస్ ఉమెన్ గా ఈమె ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి ఈమె మంచి బిజినెస్ ఉమెన్ గా గుర్తింపు పొందారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈమె నిశ్చితార్థం చేసుకున్నారనీ స్పష్టంగా అర్థమైంది అనంతరం రాధా తన కుమార్తె నిశ్చితార్థానికి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ప్రస్తుతం తన కుమార్తె పెళ్లి త్వరలోనే జరగబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాధా కూడా పెళ్లి పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈమె దర్శకేంద్రుడికి రాఘవేంద్రరావు గారిని పెళ్లి పనులలో భాగంగా కలిసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ వీడియోని షేర్ చేస్తూ అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు అంటూ రాసుకొచ్చారు. ఈ మీటింగ్ ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది అంటూ రాధ రాఘవేంద్ర రావు గారితో కలిసిన వీడియో గురించి చెప్పుకు వచ్చారు. దీంతో రాఘవేంద్రరావు స్పందిస్తూ.. చాలా రోజుల తర్వాత కలవడం సంతోషంగా ఉంది మీ కుమార్తె పెళ్లికి శుభాకాంక్షలు అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో రాధా (Actress Radha) తన కుమార్తె వివాహానికి రాఘవేంద్రరావు గారిని ఆహ్వానించడం కోసమే ఆయనని కలిసారని తెలుస్తోంది.