స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ విత్ స్మిత కార్యక్రమంలో నటి రాధికా శరత్ కుమార్ సందడి చేశారు. సుప్రియ, స్వప్నదతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినదానిపై మాట్లాడారు. అలాగే, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇప్పటివరకూ జీవితంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. జీవితం ఒక ప్రయాణం.
ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలని తెలుసుకున్నాను. ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఎక్కువగా ఆలోచించడం మానేశాను. అనుకోకుండా నటి అయ్యాను. నేను చేసిన మొదటి తెలుగు సినిమా ‘న్యాయం కావాలి. ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు తెలుగు రాదు. శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాను. నేర్చుకున్న ప్రతి విషయాన్ని చక్కగా పాటిస్తే తప్పకుండా విజయం దక్కుతుందని తెలుసుకున్నా. రాజకీయ నాయకురాలు కావాలని అనుకోలేదు. అది కూడా అనుకోకుండా జరిగిపోయింది.
అప్పట్లో డీఎంకే అగ్రనేత కరుణానిధి కుటుంబంతో నాకు సత్సంబంధాలు ఉండేవి. ఓసారి ఆయన నన్ను కలిసి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కు వ్యతిరేకంగా ప్రచారం చేయమన్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత నుంచి చివరి వరకూ నన్ను కలిసిన ప్రతిసారీ జయ ఒక సీరియస్ లుక్ పెట్టి.. “ఏంటమ్మా ఎలా ఉన్నావు? అని అడిగేవారు. రాజకీయపరంగా నా భర్త శరత్ కుమార్ తో మైత్రి కలిగి ఉన్నప్పటికీ ఆమె నన్ను సీరియస్ గానే చూసేవారు.
ఆమెతో అంత ఈజీ కాదు. ఆమె ఏదీ మర్చిపోరు” అంటూ (Radhika) రాధిక నవ్వులు పూయించారు. అనంతరం, నిర్మాత స్వప్నదత్ తన కెరీర్ గురించి మాట్లాడారు. “టీవీ ఛానెల్ పెట్టినప్పుడు నేను ఎన్నో పరాజయాలను చూశాను. దాని వల్ల 28 ఏళ్ల వయసులోనే కెరీర్ పరంగా పెద్ద దెబ్బ తగిలింది. కష్టపడ్డాను. సక్సెస్ అందుకుని ఈ స్థాయికి వచ్చాను అని తెలిపారు.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!