సినీ పరిశ్రమని వరుస విషాదాలు భయపెడుతున్నాయి. ఎవరొక సెలబ్రిటీ ప్రాణాలు వదులుతున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో, మరికొంతమంది వయోభారంతో, అలాగే యాక్సిడెంట్ల పాలై కొందరు, సూసైడ్ చేసుకుని ఇంకొందరు.. ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది చూసుకుంటే.. అప్పుడే దర్శకురాలు అపర్ణ మల్లాది, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్, మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ (Gopi Sundar) తల్లి లివి సురేష్ బాబు,సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్,
నటుడు యోగేష్ మహాజన్, అలాగే రానా (Rana) అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి, సీనియర్ నటి పుష్పలత, మలయాళ నటుడు అజిత్ విజయన్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి (Chandra Sekhar YeletiJ) తండ్రి, లెజెండరీ పాప్ సింగర్ రాబెర్టా ఫ్లాక్,హాలీవుడ్ సీనియర్ హీరో జీన్ హ్యాక్ మ్యాన్, జయప్రద (Jaya Prada) సోదరుడు రాజబాబు,ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ,మలయాళ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ వంటి వారు కన్నుమూశారు. ఈ షాక్ ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ కి చెందిన నటి తల్లి మరణించినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సీనియర్ నటి రజిత (Rajitha) తల్లి విజయలక్ష్మీ ఈరోజు మరణించారు. కొన్నాళ్లుగా ఆమెకు ఆరోగ్యం బాగోడం లేదు. విజయలక్ష్మీ వయసు 76 ఏళ్ళు. వయోభారంతో పాటు కొన్నాళ్ల నుండి అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ వస్తున్నారు. అయితే సడన్ గా ఆమెకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయినట్టు సమాచారం. దీంతో రజిత ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ విషయంపై కొందరు టాలీవుడ్ ప్రముఖులు స్పందించి.. సంతాపం తెలుపుతున్నారు. విజయలక్ష్మీ ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆసిస్తూ రజిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. ఇక ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినటువంటి కృష్ణవేణి, రాగిణి.. విజయలక్ష్మీకి చెల్లెళ్లు అవుతారు. ఇక రజిత తల్లి,పిన్ని,అత్త,వదిన వంటి పాత్రలతో బాగా ఫేమస్ అనే సంగతి తెలిసిందే.