రకుల్‌ ప్రీత్‌కి పెళ్లి మీద ధ్యాస పుట్టిందా?

టాలీవుడ్‌లో బిజియెస్ట్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌… ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లింది. అయితే పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా మారిపోతున్న తరుణంలో మళ్లీ టాలీవుడ్‌కి వచ్చేసింది. ఇప్పుడు ఆమె చేతిలో వరుస సినిమాలున్నాయి. ఆమె డైరీలో వచ్చే ఏడాది అస్సలు ఖాళీ లేదంట. ఇంత బిజీలోనూ ఆమె డైరీలో ఫొటో షూట్‌లకు స్థానముంది. అలా ఇటీవల ఓ ప్రముఖ బ్రైడల్‌ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. పెళ్లి కూతురిలా అలకరించుకుని ఫొటోలకు పోజులిచ్చింది. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కలల రాకుమారుడు ఎలా ఉండాలో చెప్పింది. అంతే కాదు తన పెళ్లి ఎలా జరుగుతుందో కూడా చెప్పింది.

‘‘నాకు ప్రేమ, పెళ్లిపై చాలా నమ్మకం ఉంది.. నాకు కాబోయే భర్తకు జీవితం విషయంలో ఖచ్చితమైన స్పష్టత ఉండాలి. నేను సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబం నుంచి వచ్చాను. నాన్న ఉద్యోగరీత్యా ఆర్మీ వాతావరణంలో పెరిగాను. దీంతో హెల్తీ లైఫ్‌స్టైల్‌ అలవాటైంది. కాబట్టి నాకు కాబోయే వాడు అలాంటి ఫాలో చేస్తే హ్యాపీ’’ అంటూ తన వుడ్‌బీ ఎలా ఉండాలోచెప్పింది. అంతేకాదు పెళ్లి విషయంలోనూ ఈ అమ్మడుకి కొన్ని ఆలోచనలు ఉన్నాయట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నా వివాహం జరగాలని కోరుకుంటున్నాను. ఏదైనా బీచ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహా వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాను’’ అని చెప్పింది రకుల్‌.

రకుల్‌ మాటలు చూస్తుంటే.. పెళ్లికి ఎక్కువమందిని పిలిచే అవకాశం లేదనే అర్థమవుతోంది. పెళ్లి ఎలాగూ హైదరాబాద్‌లో జరిగే అవకాశం లేదు. కనీసం ఇండియాలోనైనా చేసుకుంటుందా… లేక బాలీవుడ్‌ జంటల్లా విదేశాలకు వెళ్లిపోతుందా అనేది ప్రశ్న. అసలు కెరీర్‌లో ఒక విధంగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఉన్న రకుల్‌కి ఈ టైమ్‌లో పెళ్లి గురించి ధ్యాస పుట్టింది అనేది మరో ప్రశ్న. సినిమాలు తగ్గుతుంటే ఇలా ఆలోచిస్తే కరెక్ట్‌ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆమెకు వరుస సినిమాలున్నాయి. ప్రస్తుతం ఆమె క్రిష్‌ – వైష్ణవ్‌ తేజ్‌ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా బాలీవుడ్‌లో అర్జున్‌ కపూర్‌ సరసన కూడా నటిస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus