స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ (Rakul Preet) గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ పరిచయమైన రకుల్.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (Venkatadri Express) సినిమాతో తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ‘లౌక్యం’ (Loukyam), ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho) , ‘ధృవ’ (Dhruva) , సరైనోడు (Sarrainodu) , జయ జానకి నాయక (Jaya Janaki Nayaka) వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ తెలుగులోనే కాకుండా కన్నడ , హిందీ తమిళంలో కూడా నటించి మంచి విజయాలు అందుకుంది.
రకుల్ ప్రీత్ చివరిగా తెలుగులో కొండపోలం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఈ బ్యూటీ ఇటీవల హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షో చేయడానికి రకుల్ వెనకాడడం లేదు. తను లుక్స్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఫోటోషూట్లు చేస్తుంది. తాజాగా సమ్మర్ స్పెషల్ ఔట్ఫిట్లో ఈ వయ్యారి భామ చాలా గ్లామరెస్గా కనిపించింది. ఈ గ్లామరస్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
మరిన్ని సినిమా వార్తలు.View this post on Instagram