రకుల్ ప్రీత్ సింగ్ తెలివితేటలే వేరు…!

అతి తక్కువ టైములోనే స్టార్ హీరోయిన్ గా మారిన భామలలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంటుంది. ప్రభాస్ కజిన్ సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన ‘కెరటం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు కానీ.. రెండో చిత్రం ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మాత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తరువాత వచ్చిన ‘కరెంటు తీగ’ ‘లౌక్యం’ వంటి సినిమాలతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది.

దీంతో రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’, ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ మళ్ళీ చరణ్ తో ‘ధృవ’ , మహేష్ తో ‘స్పైడర్’ వంటి పెద్ద సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. అయితే హిట్ సినిమాలు పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్రలు కావడంతో ఈమెకు తరువాత ఆఫర్లు రాలేదు. తమిళంలోను, హిందీ లోనూ సినిమాలు చేసింది కానీ.. అవి కూడా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం రకుల్ కొన్ని మీడియం సినిమాలు చేస్తుంది కానీ.. పెద్ద ఆఫర్లు అయితే ఈమె చేతిలో లేవు.

సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే… బిజినెస్ రంగం విషయంలో మాత్రం రకుల్ అందరికంటే ముందుంది. ఇప్పటికే ‘F45’ జిమ్ బిజినెస్ లు మొదలు పెట్టిన రకుల్.. కొన్ని పాపులర్ సిటీస్ లో బ్రాంచ్ లు కూడా ప్రారంభించింది. ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా మొదలు పెడుతుందని టాక్ నడుస్తుంది. రకుల్ కు మంచు లక్ష్మీ, సందీప్ కిషన్, రానా వంటి వారితో మంచి సాన్నిహిత్యం ఉంది. వారి సహకారంతోనే ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టనున్నట్టు ఇన్సైడ్ టాక్. మరి వీటిలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus