షాకింగ్: రకుల్ డ్రగ్స్ తీసుకుందని చెప్పిన రియా!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటకు వస్తుందని ఎవరూ వూహించలేదు. వస్తే వచ్చింది… అది టాలీవుడ్ ఎవరూ పాకుతుందని కలలో సైతం ఎవరూ అనుకుని వుండరు. అసలు వూహించి వుండరు.సుశాంత్ మరణంతో సీనులోకి వచ్చిన మాదకద్రవ్యాల కేసులో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి మత్తు మందులకు అలవాటు పడ్డ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ బడా సెలబ్రిటీల పేర్లను ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో)కి వెల్లడించింది. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఉన్నట్టు నేషనల్ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ ఒక కథనం ప్రసారం చేసింది.

రకుల్ సహా సారా అలీ ఖాన్, సైమోన్ ఖంబట్టా కూడా డ్రగ్స్ తీసుకున్నారని రియా చక్రవర్తి చెప్పినట్టు టైమ్స్ నౌ ఆ కథనంలో వెల్లడించింది. ‘కేదార్‌నాథ్’ సినిమాలో సైఫ్ అలీఖాన్ కుమార్తె అయిన సారా, సుశాంత్ జంటగా యాక్ట్ చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడినట్టు సుశాంత్ మరణం తరవాత అసిస్టెంట్ ఒకరు చెప్పారు. సుశాంత్ ‘సొంచిడియా’ ప్లాప్ అవ్వడంతో బ్రేకప్ చెప్పిందని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కి సైమన్ ఖంబట్టా క్లోజ్ అని టాక్.

రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారం ఆధారణంగా రకుల్ ప్రీత్ సింగ్‌ని అరెస్ట్ చేస్తారా? అని టాలీవుడ్ వర్గాల్లో గుబులు మొదలైంది. టాలీవుడ్ సెలబ్రిటీల డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వస్తుందేమో అని అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చివరకు ఆ కేసు నుండి అందరూ క్లీన్ చీట్ పొందారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus