Rambha: నా భర్త ఒప్పుకుంటే ఆ హీరోతో అలాంటి పని చెయ్యాలని ఉంది: హీరోయిన్ రంభ

నిన్నటి తరం స్టార్ హీరోయిన్స్ లో అందం , అభినయం డ్యాన్స్ ఇలా అన్నీ యాంగిల్స్ లో ప్రేక్షకులను ఉర్రూతలూ ఊగించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది రంభ మాత్రమే అని కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె అప్పట్లో ఒక సెన్సేషన్. ఇప్పుడు మన టాలీవుడ్ లో శ్రీలీల ఎలా సెన్సేషన్ సృష్టిస్తుందో, ఆరోజుల్లో రంభ అంతకు పది రెట్లు ఎక్కువ సెన్సేషన్ సృష్టించింది.

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తో సమానంగా వేగంగా డ్యాన్స్ వెయ్యడం అంటే పెద్ద ఛాలెంజ్. కానీ రంభ మాత్రం ఆ ఛాలెంజ్ ని అవలీల గా స్వీకరించి చిరంజీవి తో సరిసమానంగా డ్యాన్స్ వేసేది. అంతే కాదు ఈమె నేటి తరం స్టార్ హీరోలైన, ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ తో సమానంగా కూడా డ్యాన్స్ వేసేది.అలా దాదాపుగా రెండు జనరేషన్ స్టార్ హీరోలను కవర్ చేసింది ఈ అచ్చ తెలుగు అమ్మాయి.

ఇది ఇలా ఉండగా నేటి తరం హీరోలలో (Rambha) ఆమెకి ఇష్టమైన డ్యాన్సర్ జూనియర్ ఎన్టీఆర్ అని ఎన్నో ఇంటర్వ్యూస్ లో రంభ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి అయ్యాక ఆమె సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పటికైతే మళ్ళీ ఆమెకి రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యాలు కూడా లేవు. కానీ ఒక్కసారి ఛాన్స్ వస్తే వస్తే ప్రభాస్ తో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులోని మాటని రీసెంట్ ఇంటర్వ్యూ లో బయటపెట్టింది రంభ.

ప్రభాస్ అంటే తనకి చాలా ఇష్టం అని, ఆయన సినిమాలో నాకు అవకాశం వస్తే మా ఆయన తో పోట్లాడి మరీ నటిస్తాను అని చెప్పొచొచ్చింది రంభ. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈమె చివరి సారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ చిత్రం. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమెకి అవకాశాలు వచ్చిన నటించాలని అనుకోలేదు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus