రంజిత అనగా ఠక్కున గుర్తు రాకపోవచ్చు. అయితే రెండు పేర్లు చెబితే ఈజీగా గుర్తొచ్చేస్తుంది. అందులో ఒకటి సినిమా పేరు అయితే, రెండోది స్కాండల్ పేరు. సినిమా పేరు ‘మావిచిగురు’ కాగా, స్కాండల్ పేరు నిత్యానంద లీలలు. యస్.. మీకు గుర్తొచ్చిందిగా ఆమెనే. ఇప్పడు ఆమె మామూలు వ్యక్తి కాదు. ఓ దేశానికి ప్రధానమంత్రి. అవును మీరు చదివింది నిజమే. నిత్యానంద లీలలు అని చెప్పాం కాబట్టి.. ఆ దేశం పేరు కూడా చెప్పేయొచ్చు. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస. ఆ దేశానికి ఆమె ఇప్పుడు పీఎం.
ఇక నిత్యానంద స్వామి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. స్వామిజీగా ఉంటూ వివిధ నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. మన దేశంలో కిడ్నాప్, అత్యాచారం వంటి కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఆ ఆరోపణలు తీవ్రం కావడంతో 2019లో దేశం విడిచి పారిపోయాడు. అంతేకాదు ఆయనతోపాటు శిష్యులు కూడా వెళ్లిపోయారు. అలా ఓ ద్వీపం కొనుక్కొని దానిని ఓ దేశంగా మార్చుకుని ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ అనే పేరు కూడా పెట్టారు. దేశంగా ప్రకటించుకుని, ప్రత్యేక కరెన్సీతో పాలనను కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పుడు ఆ దేశానికి… తన ప్రియ శిష్యురాలు రంజితను పీఎంను నియమించారు. ఈ విషయాన్ని నిత్యానంద తన వెబ్ సైట్‌లో పేర్కొన్నారు. అన్నట్లు చెప్పడం మరచిపోయాం. ఇప్పుడు ఆమె పేరు రంజిత కాదు.. నిత్యానందమయి. హిందువుల కోసం ఏర్పాటు చేసిన కైలాస దేశానికి రంజిత తొలి ప్రధాని అయ్యారన్నమాట. నిజానికి ఈ దేశం గురించి కొన్ని రోజుల క్రితం వార్తలు వైరల్ అయ్యాయి. కొద్ది నెలల క్రితం ఐక్యరాజ్య సమితి సమావేశాలకు కైలాస దేశం నుండి కొంత మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఇక రంజిత (Ranjitha) గురించి చూస్తే.. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ ఫీక్స్‌లో ఉన్నప్పుడే సినిమాలకు స్వస్తి పలికి నిత్యానంద దగ్గర చేరింది. ఆ తర్వాత ప్రియ శిష్యురాలు అయిపోయింది. అక్కడికి కొద్ది రోజుల తర్వాత వారి రాసలీలల వ్యవహారం బయటకు వచ్చింది. ఆ తర్వాతే ఆ టీమ్ మొత్తం దేశం విడిచి వెళ్లిపోయారు.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!