Rashmika: ఆ విషయాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను: రష్మిక

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమై అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక మందన్న గురించి సుపరిచితమే. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే సోషల్ మీడియా వేదికగా రష్మిక గురించి ఏదో ఒక వార్త వైరల్ అవ్వడమే కాకుండా తనని భారీ స్థాయిలో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.

ఈ విధంగా ఎన్నోసార్లు తన గురించి ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోనటువంటి రష్మిక ఒకానొక సమయంలో తన గురించి వచ్చే విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకపోతే గత కొద్దిరోజులుగా కాంతర సినిమా విషయం గురించి రష్మిక పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.కన్నడ సినిమా పట్ల ఈమె వ్యవహరించిన తీరుతో కన్నడ చిత్ర పరిశ్రమ ఏకంగా తనని బ్యాన్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రష్మిక ఆ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేసింది.

ఈ వార్తలపై ఈమె స్పందించినప్పటికీ ఇంకా తన గురించి ఈ విధమైనటువంటి వార్తలు ఏ మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. కాంతార సినిమా వివాదం కారణంగా రష్మిక తన సొంత ఇంటికి వెళ్లడానికి కూడా భయపడుతుందని మరోసారి వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్మిక ఇప్పటివరకు ఈ విధమైనటువంటి వార్తల గురించి స్పందిస్తూ ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ తన గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడం మాత్రం ఆగలేదు.

ఇక ప్రస్తుతం తన గురించి వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా పూర్తిగా అ వాస్తవమేనని ఇందులో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు. ఇక ప్రస్తుతం ఆమె నటించిన వరిసు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆ సినిమా ఫలితం కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus