ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డామినేట్ చేస్తుందా? ఈ మాట అంటే తొలుత ఎవరూ ‘యస్’ అనడానికి ముందుకొచ్చేవారు కాదు. ఆ తర్వాత కొంతమంది ‘యస్‌స్‌స్’ అనేవారు. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువమంది అంటున్నారు. రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటి ఏఐ గురించి ఇప్పుడు ఎక్కువమంది మాట్లాడుతున్నారు. టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే మన దేశంలో ఈ చర్చ ఇప్పుడు జరగడానికి కారణం ఓ హీరోయిన్‌ది అని చెబుతూ వచ్చిన ఓ వీడియోనే అని మీకు తెలిసిందే.
ఆ వీడియోలో మార్ఫ్ చేసి… టెక్నాలజీ భాషలో చెప్పాలంటే డీప్ ఫేక్ చేసి పెట్టిన ముఖం ప్రముఖ కథానాయిక రష్మిక మందనదే. ఈ విషయంలో ఇప్పటికే ఆమె మాట్లాడినా… తాజాగా మరోసారి ఆ విషయం గురించి మాట్లాడింది. అయితే తన గురించి కాదు… ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి చెప్పింది. అలాగే ఆ విషయంలో వచ్చిన ట్రోల్స్‌పై కూడా మాట్లాడింది.
మొదట్లో డీప్ ఫేక్ వీడియో చూసి బాధపడ్డాను. నిజానికి చాలా మంది సెలబ్రిటీలకు ఇలానే జరుగుతోంది. దీంతో తొలుత ఈ విషయంలో ఏం చేయగలం అనిపించింది. అయితే కొన్ని రోజులకు ఈ విషయాన్ని జనరల్గా తీసుకోకూడదు అనుకున్నాను. అందుకే స్పందించాను. నిజానికి ఈ రోజుల్లో ఫేక్ వీడియోలు సృష్టించడం సర్వసాధారణమైపోయింది. అలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా మనం స్పందించాలి అని (Rashmika) చెప్పింది.
నా వీడియో ఇలా వచ్చినప్పుడు తొలుత అమితాబ్ బచ్చన్ సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలా మంది మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మాయిలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి బాధిస్తే నిశ్శబ్దంగా ఉండొద్దు, కచ్చితంగా స్పందించండి. అప్పుడు మీకు ప్రజల మద్దతు లభిస్తుంది అని చెప్పింది. ఇక ట్రోల్స్ గురించి స్పందిస్తూ… నటీనటులు, క్రికెటర్లు, సెలబ్రిటీలపై మీమ్స్, ట్రోల్స్ సర్వసాధారణం. వాటిని పట్టించుకోకూడదు అని లైట్ తీసుకుంది.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!