‘షర్ట్ లేకుండా తిరిగే మగాళ్లను ఎందుకు ప్రశ్నించరు..?’

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఈషా గుప్తా ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వదు. గతంలో చాలా సార్లు ఈ బ్యూటీ బోల్డుగా ఫోజులిచ్చింది. తాజాగా మరోసారి ఓ బోల్డ్ ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. టాప్ లెస్ గా కనిపించి షాకిచ్చింది ఈ బ్యూటీ. పై భాగం మొత్తం న్యూడ్ గా ఫోజులిచ్చింది. వీపు మాత్రమే కనిపించేలా ఫోటోలు షేర్ చేసినప్పటికీ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

పోర్న్ స్టార్ అనే బిరుదు ఇచ్చి ఆమెని హేళన చేస్తున్నారు. బ్లూ ఫిలిమ్స్ లో నటించమంటూ సలహాలు ఇస్తున్నారు. దీంతో ఆమె మండిపడుతోంది. ఒక మగాడు షర్ట్ లేకుండా తిరిగితే.. అతడిని కవర్ చేసుకోమని ఎందుకు ప్రశ్నించరని అడిగింది. సొసైటీలో జెండర్ బయాస్ అనేది చాలా ఎక్కువగా ఉందని.. ఆడవాళ్లను మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పింది.

అసలు ఇలాంటి ట్రోలింగ్ పై స్పందించడం కూడా మానేశానని.. అనేవాళ్లు మనం ఏం చేసినా.. అంటూనే ఉంటారని చెప్పింది. ఒకసారి తను మేకప్ వేసుకొని ఫోటోలు పెడితే.. ‘ప్లాస్టిక్ బ్యూటీ’ అంటూ కామెంట్స్ చేశారని.. ఆ తరువాత మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేస్తే.. అందంగా లేనని, మేకప్ వేసుకోమని సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది. తనకు నచ్చినట్లు జీవిస్తానని.. సంస్కారం, సభ్యత అంటూ పాఠాలు నేర్పించొద్దని చెప్పుకొచ్చింది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus