తేజ డైరెక్షన్లో వచ్చిన ‘జయం’ అనే బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది సదా. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టడంతో తర్వాత ఆ వెంటనే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో నటించిన ‘నాగ’ సినిమాలో అవకాశం కొట్టేసింది ఈ బ్యూటీ. అటు తర్వాత ‘ప్రాణం’ ‘దొంగ దొంగది’ ‘లీలా మహల్ సెంటర్’ ‘ఔనన్నా కాదన్నా’ వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే ‘అపరిచితుడు’ చిత్రం ఈమె ఇమేజ్ ను మరింత పెంచిందని చెప్పొచ్చు.
కానీ దాని తర్వాత ఈమె నటించిన సినిమాలు ఏమీ హిట్ అవ్వలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని ఈ అమ్మడు భావిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘అపరిచితుడు’ సినిమా టైంలో ఈమెకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. విషయంలోకి వెళ్తే… ‘అపరిచితుడు’ షూటింగ్ టైములో ఓ పాట కోసం దర్శకుడు శంకర్.. హీరోయిన్ సదాకి ముంబయి నుండి డిజైనర్ కాస్ట్యూమ్స్ తెప్పించారట.
అయితే వాటి కొలతలు వల్ల ఈమె ఇబ్బంది పడినట్టు చెప్పుకొచ్చింది. సదా వక్ష సంపద బయట పడే ప్రమాదం కూడా వాటిల్లుతోందేమో అని ఆమె భయపడిందట.శంకర్ వంటి పెద్ద దర్శకుడికి ఈ విషయం చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయమేసి అలాగే డ్యాన్స్ చేయడానికి రెడీ అయిపోయిందట సదా. మొత్తానికి ఈమె ఇబ్బందిని గ్రహించిన శంకర్ షూటింగ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కాస్ట్యూమ్స్ ని తెప్పించినట్టు ఈమె చెప్పుకొచ్చింది.