Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నిజంగానే రూ.50 కోట్లు తీసుకుంటున్నారా?

  • June 25, 2024 / 02:05 PM IST

స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి (Sai Pallavi) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తండేల్ (Thandel) , బాలీవుడ్ రామాయణంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో ఈ బ్యూటీ నటిస్తున్నారు. బాలీవుడ్ రామాయణం కోసం సాయిపల్లవి ఏకంగా 50 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నరని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి వైరల్ అవుతున్న వార్తలు నిజమేనా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది.

సాధారణంగా సాయిపల్లవి రెమ్యునరేషన్ విషయంలో పట్టింపులకు పోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సినిమా ఫ్లాపైతే తన రెమ్యునరేషన్ వెనక్కిచ్చే మంచి మనస్సు కూడా సాయిపల్లవికి ఉంది. బాలీవుడ్ రామాయణంకు సాయిపల్లవి ఇతర సినిమాలకు ఎంత తీసుకుంటారో అంతే తీసుకుంటారని తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.

సాయిపల్లవి తన రేంజ్ ను పెంచే ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సాయిపల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ మేరకు సక్సెస్ అవుతారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సాయిపల్లవి సింపుల్ యాక్టింగ్ తోనే ఫ్యాన్స్ ను మెప్పిస్తున్నారు. భవిష్యత్తులో యాక్టింగ్ కు గుడ్ బై చెబితే డాక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తానని సాయిపల్లవి చెబుతుండటం గమనార్హం.

సాయిపల్లవి పారితోషికం 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా మరో మెట్టు పైకి ఎదుగుతారేమో చూడాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం సాయిపల్లవి యాక్టివ్ గా లేరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి సీత పాత్రతో ప్రేక్షకులను కచ్చితంగా మెప్పించే అవకాశాలు అయితే ఉన్నాయి.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus