తెలుగు నేర్చుకుంటున్న సాయి పల్లవి..!!

తమిళనాడుకి చెందిన నటి సాయి పల్లవి మలయాళ చిత్రం “ప్రేమమ్” తో పాపులర్ అయింది. ఈ ఒక్క సినిమాతోనే అభిమానులను సంపాదించుకుంది. వెంటనే ఎన్నో అవకాశాలు తలుపు తట్టినా తన వైద్య విద్యకు అంతరాయం ఏర్పడకూడదని ఒప్పుకోలేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడానికి అంగీకరించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు “ఫిదా” టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిజామాబాద్ లోని బాన్సువాడలో వైభవంగా జరిగింది. అనంతరం సాయి పల్లవి మాట్లాడుతూ
“ప్రేమ కథలను కొత్తగా ఆవిష్కరించే గొప్ప దర్శకుడు శేఖర్ కమ్ములతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన విజన్ ఉన్న డైరక్టర్. టాల్ హీరో వరుణ్ తేజ్ గత సినిమాలు చూసాను. చాలా బాగా నటించారు. ఈ టీమ్ లో నేను కూడా ఒకరిని కావడం అదృష్టంగా భావిస్తున్నా.

ఇది నా తొలి తెలుగు సినిమా. అయినా తెలుగులో మాట్లాడాలని భాష నేర్చుకుంటున్నా” అని చెప్పారు. తెలంగాణ అమ్మాయికి, అమెరికా అబ్బాయికి మధ్య జరిగే లవ్ జర్నీ ఈ చిత్రం. ఈ మూవీ షూటింగ్ బాన్సువాడలో 45 రోజులు, అమెరికాలో 45 రోజుల పాటు చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరక్షన్ లో “మిస్టర్” చిత్రీకరణలో బిజీగా ఉన్న వరుణ్ తేజ్, త్వరలోనే ఫిదా షూటింగ్ లో పాల్గొననున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus