Actress: ఆ యంగ్ హీరోయిన్ జాతకాన్ని వరుణ్ తేజ్ అయినా మారుస్తారా?

ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటానని భావించగా ఏజెంట్ డిజాస్టర్ రిజల్ట్ వల్ల సాక్షి వైద్యకు ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. ఈ సినిమాలో సాక్షి వైద్య నటన గురించి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అయితే ఏజెంట్ ఫ్లాప్ అయినా సాక్షి వైద్యకు వరుణ్ తేజ్ కు జోడీగా నటించే అద్భుతమైన అవకాశం దక్కింది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు.

ది ఘోస్ట్ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇదే కావడం గమనార్హం. గతేడాది లైగర్ విడుదలైన రోజునే గాండీవధారి అర్జున థియేటర్లలో విడుదలవుతోంది. భోళా శంకర్ విడుదలైన రెండు వారాలకు ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం. సాక్షి వైద్య తలరాత వరుణ్ తేజ్ సినిమాతో అయినా మారుతుందేమో చూడాలి.

ఎంతో టాలెంట్ ఉన్న (Actress) ఈ బ్యూటీకి సరైన ఆఫర్లు దక్కితే ఈమె కెరీర్ వేరే లెవెల్ లో ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. గాంఢీవదారి అర్జున సినిమాకు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు. ఈ స్టార్ ప్రొడ్యూసర్ మెగా హీరోలతో వరుసగా సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం. వరుణ్ తేజ్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాలని భావిస్తున్నారు.

వరుణ్ తేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు కెరీర్ కు ఈ సినిమా కీలకం కానుంది. ప్రవీణ్ సత్తారు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus